క్లిప్ తో పళ్ళ మధ్య గ్యాప్ కనిపించకుండా చేయొచ్చా..

     Written by : smtv Desk | Sat, Nov 06, 2021, 11:42 AM

క్లిప్ తో పళ్ళ మధ్య గ్యాప్ కనిపించకుండా చేయొచ్చా..

పళ్ళు సరిగ్గా లేకపోయినా, ఎగుడుదిగుడుగా ఉన్నా, సగం విరిగిపోయిన లేదా ఇతర కారణాల వల్ల చాలా మంది బ్రేసెస్‌ని పెట్టుకుంటారు. అయితే ఇది కేవలం చిన్న పిల్లలకి మాత్రమే అనుకుంటే పొరపాటు. ఎవరైనా సరే పంటి సమస్యలు ఉంటే బ్రేసెస్‌ని పెట్టుకోవచ్చు.
ఒకవేళ కనుక ఈ పంటి సమస్యలను చూపించకపోతే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని. చాలా మంది చిన్న విషయమే కదా అని నెగ్లెక్ట్ చేసేస్తూ వుంటారు.
ప్రతి ఒక్కరికి ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు. వయసును బట్టి సమస్యను బట్టి ట్రీట్మెంట్ చేస్తారు అని డెంటిస్టులు అంటున్నారు. అదే విధంగా వయసు లిమిట్ అనేది ఏమీ ఉండదని సమస్య ఎప్పుడు వచ్చినా బ్రేసెస్ ని పెట్టుకోవచ్చని డెంటిస్ట్ చెబుతున్నారు, ఏడు ఏళ్ల వయస్సు వాళ్ళు మొదలు పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే బ్రేసెస్ ని పెట్టుకో వచ్చు అని అంటున్నారు. అయితే ఎటువంటి సమస్య వల్ల బ్రేసెస్ ని వేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. దీనితో మీకు బ్రేసెస్ అవసరమా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది.

బయటికి కనిపించే విరిగిపోయిన పళ్ళు :
కొంత మందికి పళ్ళు విరిగిపోయి ఉంటాయి. అటువంటి వాళ్ళకి బ్రేసెస్ వేస్తారు. బ్రేసెస్ వేయడం వల్ల మంచిగా నవ్వచు. అదే విధంగా ఎప్పుడూ విరిగిపోయిన పళ్ళ వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుపోవడం కూడా జరుగుతుంది. దీని కారణంగా చెడు శ్వాస కలగడం, నోటి దుర్వాసన ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇది సమయానుసారం మరింత ఎక్కువై పోతుంది. అయితే రెండు పళ్ళ మధ్య చోటు లేక పోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇలా బ్రేసెస్ వేసి డెంటిస్ట్ ఈ సమస్యను పరిష్కరిస్తారు. దీనితో మీరు ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని డెంటిస్ట్ అంటున్నారు.

పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడం :
ఒకవేళ కనుక పళ్ళు చిన్నగా ఉంటే అప్పుడు పంటికి పంటికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పాచి పట్టడం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఒకవేళ కనుక డెంటిస్ట్ బ్రేసెస్ వేస్తే అప్పుడు ఆ గ్యాప్ పూర్తిగా మూసుకుపోతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు కూడా బ్రేసెస్ ని ప్రిఫర్ చేస్తే మంచిది దీంతో సమస్య నుండి బయట పడవచ్చు.

కొరికేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇబ్బందులు :
కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యలు ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు లేదా ఏమైనా పదాలు పలికేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య వలన కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒకవేళ కనుక దీనికి ట్రీట్మెంట్ చేయకుండా అలానే వదిలేస్తే మరింత ప్రమాదకరంగా మారుతుందని గమనించాలి. కొన్ని కొన్ని సార్లు సెన్సిటివిటీ సమస్యలు కూడా వస్తాయి. వేడిగా కాని చల్లగా కాని ఆహార పదార్థాలు తీసుకుంటే పళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా బాధపడే వారు డెంటిస్ట్ ని కన్సల్ట్ చేసి సమస్యలని పూర్తిగా దూరం చేసుకోవాలి. లేదు అంటే ఈ సమస్య జీవితాంతం బాధ పెడుతుంది అని తెలుసుకోండి.
కొన్ని కొన్ని సార్లు పంటి సమస్యల వల్ల నమలడానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నాలుక కొరుక్కోవడం లేదా పెదాలను కొరుక్కోవడం లాంటివి జరుగుతుంటాయి. మీరు కూడా అలా బాధ పడుతుంటే తప్పక డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి.

పంటి నొప్పి మరియు తలనొప్పి:
ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పళ్ళకు ఇబ్బంది వస్తే తప్పక వైద్యుల సలహా తీసుకోవడం మర్చిపోకండి. పంటి నొప్పి తలనొప్పి ఒకదానికొకటి రిలేటెడ్ గా వస్తూ ఉంటాయి పంటి నొప్పి వల్ల ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి బాధలు కూడా మీరు భరిస్తూ ఉంటే డెంటిస్ట్ దగ్గరకి వెళ్లడం మంచిది దీనితో మీకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
అయితే చాలా మందికి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. కానీ అలా చేయడం వల్ల పంటి సమస్యలు మరింత తీవ్రంగా మారిపోతాయి. మీరు కూడా సమస్య వున్నా డెంటిస్ట్ దగ్గరకి వెళ్లడం లేదా..? అయితే మీ సమస్య కూడా తీవ్రంగా మారే అవకాశం వుంది గమనించండి. కొందరైతే చిన్న చిన్న సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఇంట్లో ఉండే చిట్కాలు పాటిస్తూ ఉంటారు. దీని వల్ల అప్పటికే ఉపశమనం లభించచ్చేమో కానీ పూర్తిగా తగ్గదు.
కనుక డెంటిస్ట్ ని సంప్రదించి.. అవసరమైతే బ్రేసెస్ లేదా ట్రీట్మెంట్ ని తీసుకోవడం మంచిది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ..? ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించడానికి వీలవుతుంది. ఒకవేళ కనుక సమస్య పెద్దదిగా మారిపోతే దానిని ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం. కాబట్టి సొంత వైద్యం కంటే కూడా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది తద్వారా సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టొచ్చు.





Untitled Document
Advertisements