ధనియాల కషాయంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా!

     Written by : smtv Desk | Fri, Nov 12, 2021, 06:45 PM

ధనియాల కషాయంలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా!

ప్రస్తుతం ప్రతిఒక్కరు రకరకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒక టాబ్లెట్ వేసుకుంటే చిటికెలో మన సమస్య తొలగిపోవాలని కోరుకునేవాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అటువంటి టాబ్లెట్లను ఉపయోగించడం వల్ల కేవలం తాత్కాలిక ప్రయోజనం మాత్రమే లభిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అయితే సహజంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే కొన్నిరకాల సమస్యలను నయం చేయడానికి ఈ ఒక్క కషాయాన్ని తీసుకుంటే సరి పోతుంది.
ఈ కషాయాన్ని తీసుకోవడానికి చాలా కష్టపడే అవసరం లేదు, కేవలం మనకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ కషాయాన్ని తయారు చేసుకోవచ్చు.

రోజంతా కష్టపడి అలసిపోవడంతో ఉదయాన్నే నిద్రలేవడం కష్టమవుతుంది. దాంతో కొందరు సమయం లేక పోవడం వల్ల అల్పాహారాన్ని కూడా మానేస్తుంటారు మరికొందరైతే బయట ఆహారాన్ని ఎక్కువగా తింటారు. దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరైన ఆహారం మరియు నిద్ర ఎంతో అవసరం.
కాబట్టి మీ రోజును కొంచెం త్వరగా ప్రారంభించుకోండి. మార్నింగ్ రొటీన్‌లో భాగంగా చల్లని ధనియాల కషాయం తాగడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కషాయంలో కావలసినంత రాక్ షుగర్ ను కూడా కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని ఖాళీ కడుపున తాగడం వల్ల ఎసిడిటీ, బర్నింగ్ సెన్సేషన్ వంటి జీర్ణప్రక్రియకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నిపుణులు తెలిపారు
ధనియాలులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. వీటిలో అధిక శాతం ఫైబర్ ఉండటం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఎంతో మేలు చేసే గుణం ధనియాలులో ఉంటుంది అని చెబుతారు. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున 40 నుండి 50 ml వరకు ధనియాల కషాయం తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ సంబంధించిన సమస్యలు తో పాటు జ్వరం, అబ్డామినల్ పెయిన్, ఇన్ఫెక్షన్స్ మొదలగు సమస్యలు కూడా నయం అవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. '

ఇలా రోజుకి ఒకసారే కాదు రోజుకు రెండు మూడు సార్లు 10 నుండి 30 ml వరకు ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా 6 నుండి 8 వారాలు వరకు తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం మీరు పొందవచ్చు అని తెలిపారు.

ధనియాల కషాయాన్ని తాగడం వల్ల కలిగే ఉపయోగాలు:

టాక్సిన్స్ ను తొలగించుకోచ్చు:
సరైనా జీవనశైలి లేకపోవడం వల్ల మరియు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ఎక్కువవుతాయి. వాటిని తొలగించుకోవడానికి ప్రతి రోజు ఉదయాన్నే ధనియాల కషాయాన్ని తీసుకుంటే మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకోవచ్చు. దాంతో రోజు మొత్తం ఎంతో ఫ్రెష్‌గా ఉంటుంది.

యాక్ని, పిగ్మెంటేషన్ మరియు స్కార్స్ ను తొలగించుకోవచ్చు :
ధనియాలలో ఐరన్, యాంటీ ఫంగల్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ప్రతి రోజు ధనియాల కషాయాన్ని తాగడం వలన చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోయి చర్మం ఎంతో మృదువుగా, ఆరోగ్యంగా మరియు యవ్వనంగా కనబడుతుంది.

రోగ నిరోధక శక్తిని పెంచుకోచ్చు :
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తోంది, దాని నుండి విముక్తి చెందడానికి రోగ నిరోధక శక్తి మన శరీరానికి ఎంతో అవసరం. ధనియాలు లో ఉండేటు వంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండేటు వంటి ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి. దానితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగు పడుతుంది, ఎటువంటి వ్యాధులతో అయినా పోరాడవచ్చు.

బరువు తగ్గొచ్చు:
ప్రతి రోజు ఉదయాన్నే ధనియాల కషాయాన్ని తాగడం వల్ల శరీరం ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. దానికి కారణం మెటబాలిజం మెరుగుపడటం. మీ మెటబాలిజం బాగుంటే బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి డైట్స్ ను పాటించిన ఈ ధనియాల కషాయాన్ని తప్పకుండా తీసుకోండి.

జుట్టు ధృడంగా :
ధనియాలలో విటమిన్ ఏ, సి మరియు కే లు ఉంటాయి. వీటి వల్ల జుట్టు రాలిపోకుండా దృఢంగా ఉంటుంది. దానితో పాటుగా జుట్టు చిట్లిపోకుండా ఉండడానికి కాపాడుతుంది. కాబట్టి అందమైన మరియు దృఢమైన కురుల కోసం క్రమం తప్పకుండా ధనియాల కషాయాన్ని తాగండి.

మీరు ఒక కప్పు ధనియాల కషాయాన్ని తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఒక కప్పు నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ఈ నీరును రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి ఆ నీరును తాగాలి. రుచి కొరకు రాక్ షుగర్‌ను ఉపయోగించవచ్చు.
ఇలా స్ట్రెయిన్ చేసిన ధనియాలను తర్వాత ఎండబెట్టి సహజంగా వంటలలో వేసుకో వచ్చు. ఈ కషాయం తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు మీరు పొందవచ్చు. కనుక తప్పకుండా రోజు ఆహారంలో భాగంగా ధనియాలు కషాయాన్ని తీసుకోండి. చూసారు కదా ఇలా ఈ టిప్స్ ని అనుసరిస్తే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది. కనుక ఈ టిప్స్ ని రోజు ఫాలో అయ్యి ఆరోగ్యంగా వుండండి. ఏ సమస్యలు లేకుండా హాయిగా వుండండి.










Untitled Document
Advertisements