దానిమ్మ గింజలు సులువుగా ఒలిచేయండిలా..

     Written by : smtv Desk | Fri, Nov 12, 2021, 06:46 PM

దానిమ్మ గింజలు సులువుగా  ఒలిచేయండిలా..

ఈ మధ్య సోషల్ మీడియాలో దానిమ్మ గింజలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్చల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలను చూసి సోషల్ మీడియా యూజర్లు ఇటువంటి కొత్త విధానాలు మాకు తెలీదు అని కామెంట్ చేస్తున్నారు, మరి కొందరైతే అటువంటి విధానాలు కొన్ని దానిమ్మ పండ్లకు మాత్రమే వర్తిస్తాయి అని, ఎందుకంటే వాటిలో తక్కువ నీటి శాతం ఉంటుందని అంటున్నారు. ఎక్కువగా జ్యూసీగా ఉన్న దానిమ్మ పండ్లను ఇలా చేస్తే వృధా జరుగుతుంది అని భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా చూపిస్తున్న వీడియోలో దానిమ్మ పండు అడుగు భాగం లో స్క్వేర్ ఆకారంలో కట్ చేసి, ఆ తర్వాత స్క్వేర్ ఆకారం నుండి లోపల ఉండే తెల్లని పొరను ఆధారంగా తీసుకుని భాగాలుగా విభజిస్తారు. ఇలా చేయడం వల్ల దానిమ్మ గింజలు సులువుగా వస్తున్నాయి. అయితే ఈ పద్ధతి అన్ని దానిమ్మ పండ్లకు వర్తించవు. అయితే, బాగా పెద్ద దానిమ్మ పళ్ళు అయితే గింజలు బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
అయితే చిన్న సైజులో ఉండేటు వంటి దానిమ్మ పండును కట్ చేయడం ఎలా.....?
చిన్న సైజు దానిమ్మ పండుని కట్ చేయడానికి ముందుగా దానిని రెండు భాగాలుగా చేయమన్నారు, అలా చేసి దానిమ్మ పండు యొక్క పై భాగాన్ని కొంచెం బరువుగా ఉండే ఎటువంటి వస్తువుతో అయినా పై భాగంను కొట్టి లేదా చేతితో టాప్ చేయాలి. ఇలా చేస్తే దానిమ్మ గింజలు సులువుగా వస్తాయి. ముందుగా దానిమ్మ పండును కట్ చేయడానికి స్టెమ్ భాగాన్ని గుర్తించాలి. స్టెమ్ భాగంలో చాలా పల్చగా దానిమ్మ పండును కట్ చేయాలి.
లోపల ఉండే తెల్లని పొర బట్టి దానిమ్మ పండును నాలుగు లేదా ఐదు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది.
ఆ తెల్లని పొర ఆధారంగా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకొని కత్తితో కోయండి.
ఇలా ఒక భాగాన్ని విభజించిన తర్వాత అదే విధంగా మిగిలిన భాగాలను కట్ చేయండి.
ఇప్పుడు చేతితో మీరు కట్ చేసిన భాగాలను బయటకు తీయండి. మధ్య భాగంలో ఉండే పెద్ద భాగం ను బయటకు తీయండి.
ఇప్పుడు చేతిలోకి దానిమ్మ పండును తీసుకొని చేతితో దానిమ్మ గింజలు బయటకు తీసేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఆ తెల్లని పొర గింజలులో కలిసిపోకుండా ఉండటానికి మంచి నీళ్ల సహాయాన్ని ఉపయోగించండి.
ఈ పద్ధతి కష్టంగా అనిపిస్తే విభజించిన తర్వాత దానిమ్మ పండును చెక్క స్పూను సహాయంతో తొక్క భాగం పై కొట్టండి. ఇలా చేయడం వల్ల గింజలు కిందపడిపోతాయి.
మిగిలిన గింజలు తీయడానికి చేతి సహాయాన్ని కూడా ఉపయోగించవచ్చు. మంచి నీరు సాయంతో తెల్లని పొరను తీసేసిన ఇంకా మిగిలిపోతే గింజలలో మంచి నీళ్లు పోసి స్ట్రైన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇతర పదార్థాలు లేకుండా రుచికరమైన దానిమ్మ గింజలను మీరు తినవచ్చు.






Untitled Document
Advertisements