ముఖంతో పాటు మీమెడను మెరిపించండిలా..

     Written by : smtv Desk | Fri, Nov 12, 2021, 06:47 PM

ముఖంతో పాటు మీమెడను మెరిపించండిలా..

సహజంగా ప్రతిఒక్కరు ఎంతో అందంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందువల్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ రకరకాల మార్గాలలో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకుంటారు.అయితే కొంత మందిలో ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది కానీ మెడ మాత్రం నల్లగానే ఉంటుంది. అలాంటప్పుడు మంచి లుక్ పొందడం కష్టమవుతుంది.
మెడ నల్లగా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అధిక సమయం ఎండలో ఉండడం, సరైన విధంగా క్లీన్ చేసుకోకపోవడం వంటి మొదలైన కారణాలు ఉంటాయి. మరి ఈ సమస్య నుండి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోండి..

ఎక్స్‌ఫోలియేషన్ :
ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మరియు బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, ఈ రెండింటితో చర్మంను ఎక్సఫోలియేషన్ చేయడం వల్ల మెడ భాగం మెరుస్తుంది. వీటితో చర్మంకు క్లీన్సింగ్ అవుతుంది దాని వల్ల నల్లటి మెడ తెల్లగా మారుతుంది. ఈ ప్రక్రియను రోజుకు రెండు సార్లు చేస్తే చర్మం కు ఎంతో ఉపయోగం ఉంటుంది.

మెడికల్ ట్రీట్మెంట్ :
అలానే మెడ భాగం బాగా నల్లగా ఉండి ఎన్ని చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి చిట్కాలు పని చేయకపోతే మీరు తప్పకుండా డెర్మటాలజిస్ట్ ను కన్సల్ట్ చేయండి, అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ను సూచించే అవకాశాలు ఉంటాయి. లేజర్ తెరపీ చేయించుకునే ముందు నల్లటి మెడ రావడానికి గల కారణాలను సరిగ్గా తెలుసుకుని సరైన విధంగా మెడికల్ ట్రీట్మెంట్ ను పొందండి.

రెటినోయిడ్స్ :
డార్క్ నెక్ నుండి విముక్తి పొందడానికి స్కిన్ పీలింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మెడ భాగం తెల్లగా మరియు కాంతివంతంగా ఉంటుంది. ఇటువంటి ట్రీట్మెంట్ ను పొందడానికి డాక్టర్ సూచనలు తప్పకుండా తీసుకోండి. ఏది ఏమైనా ఇలా కూడా మీరు మంచి మార్పుని గమనించంచ్చు.

ఫేస్ మాస్క్ లేదా నెక్ మాస్క్ :
చాలా మంది ఫేస్ ప్యాక్స్ ను ధరించేటప్పుడు కేవలం ముఖం వరకు ఉపయోగిస్తారు. అలా కాకుండా ముఖానికి అప్లై చేసేది మెడ భాగం పై కూడా అప్లై చేయాలి. మెడ భాగం ఎక్కువగా నల్లగా ఉంటే వారానికి రెండు నుండి మూడు సార్లు వరకు ఫేస్ మాస్క్ ను మెడ భాగం కు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందుతారు.

అలోవెరా జెల్ :
అలోవెరా జెల్ సహజంగా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మెడ భాగం పై అప్లై చేసుకుని ఉదయాన్నే వాష్ చేయండి ఇలా చేస్తే తరచుగా మీ మెడ భాగం లో నలుపుదనం తగ్గిపోతుంది అలోవేరా డీ పిగ్మెంట్ఇంగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం రంగు మెరుగుపడుతుంది.

సన్ స్క్రీన్ ను ఉపయోగించండి :
బయటకు వెళ్లేటప్పుడు హానికరమైన యూవీ కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ ను తప్పకుండా ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించక పోతే సూర్యరశ్మి తగలడం వల్ల చర్మం నల్లబడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సన్ స్క్రీన్ ను ముఖం, మెడ భాగం మరియు మోచేతులుకు కూడా అప్లై చేయడం మర్చిపోకండి. దాని వల్ల సూర్య కిరణాల ప్రభావం మన చర్మం మీద పడదు.

ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. దాని వల్ల పిగ్మెంటేషన్ జరగకుండా కాపాడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని దానిలో అంతే మోతాదు నీళ్ళు కలపండి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి రెండు నుండి మూడు నిమిషాల వరకు ముఖం మరియు మెడ భాగమును కడుక్కోండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం మీరు పొందవచ్చు.

మంచి డైట్ మరియు హైడ్రేషన్ :
చర్మం పై ఎంత శ్రద్ధ తీసుకున్న శరీరంలోకి ఆరోగ్యకరమైన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి తాజా పళ్ళను ఖచ్చితంగా తీసుకోండి. వాటిలో ఉండే పోషక విలువలు వల్ల సహజంగానే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలు ఎంత అవసరమో మంచినీళ్లు కూడా అంతే అవసరం. ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల వరకు క్రమం తప్పకుండా తీసుకోండి. చర్మ ఆరోగ్యానికి హైడ్రేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

పాలు :
పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది దానివల్ల ముఖం మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మెడ భాగం నల్లబడినప్పుడు పాలను అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత 20 నుండి 30 నిమిషాల వరకు ఉంచి ఫేస్ వాష్ చేసుకోండి. ఇటువంటి చిట్కాలను పాటిస్తే మీరు తప్పకుండా నల్లటి మెడ నుండి విముక్తి పొందవచ్చు. అలానే మరింత అందంగా మారచ్చు.





Untitled Document
Advertisements