మీరు వాడే శనగపిండి కల్తీదా.. ఇలా తెలుసుకోండి..

     Written by : smtv Desk | Tue, Nov 16, 2021, 04:26 PM

మీరు వాడే శనగపిండి కల్తీదా.. ఇలా తెలుసుకోండి..

..ఈ మధ్యకాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు దాదాపు అన్ని కల్తీకి గురవుతున్నాయి. అన్ని ఆహార పదార్థాల మాదిరిగానే శనగపిండిని కూడా కల్తీ చేస్తూ ఉంటారు. అయితే ఈ కల్తీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా గమనించడం జరిగింది. ఈ సంస్థ చేసిన పరిశోధనలో శనగపిండిలో బియ్యం, బఠాని, కేసరి పప్పు మరియు మొక్కజొన్న వంటి వాటితో కలిపి కల్తీ చేస్తున్నారు. అయితే వీటిలో అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే ఆర్టిఫిషియల్ కలర్స్ మరియు కేసరి పప్పు.
ఈ రెండింటిని ఉపయోగించి శనగపిండిని కల్తీ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. నిజానికి కేసరి పప్పును 1961 లోనే ఉపయోగించొద్దని రద్దు చేశారు. కల్తీ శనగపిండిని తీసుకోవడం వల్ల శరీర కింద భాగంకు సంబంధించిన పెరాల్సిస్ వస్తుంది. దాంతో పాటుగా భుజాలు, వెన్నెముక సమస్యలు కూడా వస్తాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల 2016 లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కేసరి పప్పు యొక్క రద్దును తొలగించేసింది.
అందువల్ల ప్రస్తుతం శనగపిండిని కల్తీ చేయడానికి కేసరి పప్పును ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలాగో ఆపలేం. కనుక శనగపిండిని తీసుకునేముందు ఒక చిన్న పరిశోధనను మీరే స్వయంగా చేసుకుని అప్పుడే సెనగపిండిని తీసుకోండి.


ఒక గ్రాము శెనగపిండిని టెస్ట్ ట్యూబ్‌లో తీసుకోండి. దీనిలో మూడు మిల్లీ లీటర్లు మంచి నీళ్లు కలపండి. తర్వాత రెండు మిల్లీ లీటర్లు కాన్సెంట్రేట్ హెచ్సిఎల్ జోడించండి. చివరగా టెస్ట్ ట్యూబ్ లో ఉండే మిశ్రమం మొత్తం కలిసేలా చూడండి. కొంత సమయం తర్వాత శనగపిండి పింక్ కలర్‌లోకి మారితే అది కల్తీదని అర్థం. అదే ఎటువంటి రంగు మారకపోతే అది స్వచ్ఛమైనది.
శెనగ పిండిని ఉపయోగించి ఎన్నో రకాల వంటలను చేసుకో వచ్చు, మిఠాయిలు నుండి స్నాక్స్ వరకు అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు. వీటితో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. అంతేగాక శనగ పిండిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కార్డియో వాస్క్యులర్ జబ్బులకు సంబంధించిన వ్యాధులు దరి చేరకుండా ఉండడానికి శనగపిండి ఎంతో ఉపయోగ పడుతుంది. అలానే శాఖాహారం మాత్రమే తీసుకొనే వారికి ప్రోటీన్ చాలా అవసరం. నిజానికి గోధుమ పిండిలో ఉండే ప్రోటీన్ కంటే శనగ పిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి ఎంతో అవసరం, అంతేకాదు ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కండరాలు కూడా దృఢంగా మారుతాయి. శనగపిండిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. దానితో పాటుగా కొలెస్ట్రాల్ శాతం తగ్గడానికి కూడా దారి తీస్తుంది.
సహజంగా శనగపిండిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయని అపోహ పడుతుంటారు. కాకపోతే గోధుమ పిండిలో కంటే శనగపిండిలోనే తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అని అనుకుంటే మీ డైట్‌లో భాగంగా ప్రతి రోజు శనగపిండిని తీసుకోండి. అంతే కాదు శెనగపిండిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది కానీ మీరు తీసుకునేది తక్కువ కేలరీలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.





Untitled Document
Advertisements