శివలింగం ఇంట్లో ఉంచకూడదు అంటారెందుకు?

     Written by : smtv Desk | Thu, Nov 18, 2021, 01:37 PM

శివలింగం ఇంట్లో ఉంచకూడదు అంటారెందుకు?

మన దృష్టి దేవాలయంలోని వివిధ విగ్రహాలను చూస్తూ చూస్తూ వచ్చి చివరకు మూలవిరాటు శివలింగం పై కేంద్రీకృతం కావాలి. అప్పుడు నందీశ్వరుని కొమ్ములమీద కుడి చెయ్యి బొటన వేలు ,చూపుడు వేలు ఆనించి ఎడమ చేతితో నంది తోకను నిమురుతూ మధ్య నుంచి చూడాలి. ఏకాగ్రతతో దృష్టిని అటు నిటు పోనివ్వకుండా భగవంతునిపై లగ్నం చేయాలి. ఈ విధంగా నందీశ్వరుని కొమ్ముల మధ్య నుండి మన దృష్టి నేరుగా శివ లింగం పై పడుతుంది. ఎందుచేత అంటే నందీశ్వరుని దృష్టి ఎప్పుడు శివుని మీదే ఉంటుంది. ఇక కొంతమంది ఇళ్ళలో శివలింగం పుజాలో పెట్టుకుని పూజిస్తుంటారు. అయితే చాల మందికి శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. శివునికి నిత్య పూజలు జరగాల్సిందే. అలా చేయగలిగితేనే శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము నిర్ణీతమైన సమయంలో అభిషేకమూ, నివేదన జరగాలి. అలా నిష్టగా చేసే పరిస్థితితులు మనకు లేవు. కావున శివలింగాన్ని అలా నిత్య పూజ చేయలేనప్పుడు శివుని ఆగ్రహానికి గురికావటం కన్నా మీ ఇంట్లో ఉన్న శివలింగాన్ని మీకు దగ్గరలోని గుడిలో పెట్టేయడం మంచిది.





Untitled Document
Advertisements