'24 గంటల కడుపునొప్పి' ఎందుకు వస్తుంది?

     Written by : smtv Desk | Thu, Nov 18, 2021, 01:42 PM

'24 గంటల కడుపునొప్పి' ఎందుకు వస్తుంది?

'అపెండిసైటిస్' ను వాడుకలో '24 గంటల కడుపునొప్పి' అని అంటారు. చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు కలిసే చోట పొత్తి కడుపులో కుడివైపు బొటనవేలి ఆకారంలో సంచిలాంటి అవయవం ఉంటుంది. దీనిని 'అపెండిసైటిస్' అంటారు. ప్రస్తుతమిది మన శరీరంలో పనికిరాని అవయవం! సెల్యులోజ్ అనే పదార్థాన్ని జీర్ణం చేసుకునేందుకు ఉపయోగపడే ఈ అవయవాన్ని మానవుడు కొన్ని తరాల నుంచి వాడకపోవడం వల్ల మన శరీరంలో దీనివల్ల ఏ ఉపయోగం లేదు. సంచీలాగా ఉండే ఈ అపెండిసైటిస్ లో కండరాల తలుపులు ఉంటాయి. అపెండిక్స్ లో తయారయ్యే 'మ్యూకస్' లాంటి పదార్థాలను ఈ తలుపులు బయటకు (ప్రేవుల్లోకి) నేట్టేస్తుంటాయి. జీర్ణం కాని ఆహారం ఏదైనా ఈ తలుపుల పై పేరుకుంటే లోపాలున్నా మ్యూకస్ బయటకు రాదు. దానివల్ల అపెండిక్స్ లోపల వేడి పెరిగి బాక్టీరియా పుడుతుంది. ఈ బాక్టీరియా వల్ల అపెండిక్స్ వాచీ విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. సరైన సమయంలో శాస్త్రచికిత్స చేసి అపెండిక్స్ ను తొలగించుకోకుంటే అది పగిలి శరీరమంతా బాక్టీరియా వ్యాపించి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది.





Untitled Document
Advertisements