అమ్మాయిలకు ఆర్థిక భద్రత...ఈ స్కీమ్‌తో చదువు, పెళ్లికి ఇబ్బంది ఉండదు

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 11:53 AM

అమ్మాయిలకు ఆర్థిక భద్రత...ఈ స్కీమ్‌తో చదువు, పెళ్లికి ఇబ్బంది ఉండదు

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. ఆడ పిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక పథకాలు ఉన్నాయి. వీటిల్లో సుకన్య సమృద్ధి యోజన కూడా ఒకటి. ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించొచ్చు. చదువు, పెళ్లి వంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

సుకన్య సమృద్ధి యోజనలో చేరాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇలా 15 ఏళ్లు డిపాజిట్ చేయాల్సిందే. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. మెచ్యూరిటీ కాలం తర్వాతనే చేతికి డబ్బులు వస్తాయి.

అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఒక ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు ఈ పథకంలో చేరొచ్చు. పదేళ్లలోపు ఆడ పిల్లలకే ఈ స్కీమ్ వర్తిస్తుందని గమనించాలి.

ఈ స్కీమ్‌లో చేరిన వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు రోజుకు రూ.416 ఆదా చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ.65 లక్షలు పొందే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకులు లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి కూతురి పేరుపై సుకన్య అకౌంట్ తెరవొచ్చు.





Untitled Document
Advertisements