కోహ్లీ స్థానంలో సూర్యాని ఆడించాలి : గంభీర్

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 11:59 AM

కోహ్లీ స్థానంలో సూర్యాని ఆడించాలి : గంభీర్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి టీ20 జట్టులోకి వచ్చినా.. అతడ్ని నెం.3లో కాకుండా నెం.4లో ఆడించాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. న్యూజిలాండ్‌తో జైపూర్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో నెం.3లో ఆడిన సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6x4, 3x6 సాయంతో 62 పరుగులు చేయగా.. టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టీ20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీకి భారత సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు.

165 పరుగుల ఛేదనలో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా ఆడిన సూర్యకుమార్ యాదవ్.. స్పిన్నర్ల టాడ్ అస్లే బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి రెండు భారీ సిక్సర్లు బాదాడు. అలానే ఫెర్గూసన్‌ విసిరిన ఓ బంతిని స్కూప్ చేస్తూ స్టాండ్స్‌లోకి కొట్టేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌‌లో స్టంప్‌లను వదిలేసి ఆడబోయి క్లీన్‌ బౌల్డయ్యాడు. కెరీర్‌లో ఇప్పటి వరకూ 9 టీ20లు ఆడిన సూర్యకుమార్ యాదవ్.. 243 పరుగులు చేయగా.. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్‌రేట్ 160.93గా ఉండటం విశేషం.

‘‘సూర్యకుమార్ యాదవ్ వద్ద బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అతను స్పిన్‌‌ని సమర్థంగా ఎదుర్కోగలడు. క్రికెట్‌లోని అన్ని రకాల షాట్స్‌ని సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు.. అతను 360° ప్లేయర్. అందుకే అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ విరాట్ కోహ్లీ టీ20 జట్టులోకి వచ్చినా.. సూర్యకుమార్‌ని నెం.3లోనే ఆడిస్తే బాగుంటుంది. కోహ్లీ నెం.4లో బ్యాటింగ్ చేస్తే బెటర్. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విధ్వంసకరరీతిలో ఆడతారు. వారి దూకుడుని సూర్య కొనసాగిస్తాడు. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు పడితే..? నెం.4లో ఆడే కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దగలడు’’ అని గంభీర్ వెల్లడించాడు.





Untitled Document
Advertisements