పంచదార కల్తీని కనుగొండిలా..

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 12:09 PM

పంచదార కల్తీని కనుగొండిలా..

తినడానికి తియ్యగా, రుచిగా ఉండి ఎంత తిన్న ఇంకా ఇంకా కావలి అనిపిస్తాయి పంచదారతో చేసే వంటకాలు. అయితే రుచిగా ఉన్నాయి కదా అని అతిగా లాగించేస్తే నరకానికి చేరువలో ఉన్నట్టే ఎలా అంటారా పంచదారని "వైట్ డెత్ " గా పిలుస్తున్నారు నిపుణులు. మరి అటువంటి పంచదారని మనం తీసుకుంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్టే ఎలా అనేది ఇప్పుడు చూద్దాం..నిపుణుల అభిప్రాయం ప్రకారం, పంచదార వినియోగం విషయానికి వస్తే, ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అయితే పంచదార వినియోగం మరింత హానికరం అని మీకు తెలుసా? ఎందుకంటే దానికి కారణం - పంచదార కల్తీ అవ్వడం.
FSSAI ప్రకారం, పంచదార తరచుగా యూరియాతో కల్తీ చేయబడుతుంది అని తేలింది. ఇటీవల, FSSAI ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఇంట్లో పంచదార కల్తీని ఎలా చెక్ చేయాలో చూపించారు. తెలియని వారి కోసం, FSSAI సోషల్ మీడియాలో #DetectingFoodAdulterants అనే హాష్ ట్యాగ్ పేరుతో సర్చ్ చేసి తెలుసుకోండి. ఈ హాష్‌ట్యాగ్‌లో, ప్రతి వారం వారు సాధారణ వంటగది వస్తువుల కల్తీ గురించి, మీరు వాటిని ఇంట్లో ఎలా చెక్ చేయవచ్చు అనే విషయాల గురించి అవగాహనా కలిపిస్తారు.
మనం అసలు అంత ఎక్కువ పంచదార ఎందుకు తింటున్నాం అనేదే ఇక్కడ ప్రశ్న. దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, మన శరీరానికి లభించే శక్తికి కావాల్సిన వాటిలో ఒకటయిన పంచదార చౌకగా, సులభంగా లభించడం.
అమెరికా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం "భారత్‌లో పంచదార సామాన్యులు ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. పేదలకు కూడా అత్యంత చౌకగా దొరికే వాటిలో పంచదార ఒకటి.
కాలం గడిచేకొద్దీ, భారత్‌లో పంచదార వినియోగం చాలా పెరిగింది అని చెప్పుకోవచ్చు. 60 దశలో, దేశంలో ఏడాదిలో 2.6 మిలియన్ మెట్రిక్ టన్నుల పంచదార మాత్రమే వినియోగించేవారు. అది 90వ దశ మధ్యలో 13 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది.
గత ఐదు శతాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలలో ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం కూడా పెరిగింది.
అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 2012 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల అమ్మకాల్లో 77 శాతం భాగం ప్రాసెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి.
ప్రాసెస్డ్ ఫుడ్స్‌‌ తయారీలో అత్యంత ముఖ్యమైన పదార్థం పంచదార కావడం విశేషం. ఎక్కువగా రుచి కోసం, కొన్నిసార్లు వాటి కాల పరిమితి పెంచడానికి దీనిని ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వైద్యులు "గ్లోబల్ ఒబెసిటీ ఎపిడమిక్ (అంతర్జాతీయ ఊబకాయ సమస్య)కు ముఖ్యమైన కారణం పంచదార వినియోగమే" అని చెబుతున్నారు
ఫ్రెడ్రిక్‌ ఓలర్ 1828లో ఆవిష్కరించిన ఈ సేంద్రీయ మిశ్రమం రసాయనిక శాస్త్రంలో ఒక మైలురాయి చెపుకోవచ్చు. ఇది నీటిలో బాగా కరుగుతుంది. మానవుల రక్తంలో కూడా ఇది కొద్దిగా ఉంటుంది. అయితే ఈ యూరియా రక్తంలో ఎక్కువైనప్పుడు వచ్చే వ్యాధిని యూరీమియా అంటారు. ఇది ఎక్కువగా మూత్రపిండాలు పాడైనప్పుడు bodyలోనే జెనెరేట్ అవుతుంది. అందరకి తెలిసిన విషయమే, వ్యవసాయంలో ఎరువుగా యూరియా ఉపయోగిస్తారు.
యూరియా అనేది సేంద్రీయ పద్ధతుల్లో తయారు చేయబడింది,దానిని కార్బమైడ్ అని కూడా పిలుస్తారు. యూరియాకి రంగు వాసన ఉండవు. నీటిలో బాగా కరుగుతుంది , ప్రాక్టికల్‌గా ఇది అంత విషపూరితం కాదు. ఇది ఎరువులలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది అంతేకాకుండా, రసాయన పరిశ్రమకు ముఖ్యమైన ముడి పదార్థం. ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారం, యూరియాని మనుషులు తీసుకుంటే వికారం, వాంతులు, అతిసారం, తలనొప్పి, గందరగోళం ఇంకా bodyలో ఎలక్ట్రోలైట్ తక్కువ అవడానికి కారణమవుతుంది.

ఇంట్లో పంచదార కల్తీని ఎలా పరిశీలించాలి?
1. కొంచెం పంచదార తీసుకొండి
2. నీటిలో పంచదార వేసి, అది కరిగిపోయే వరకు వేచి ఉండండి. అది కరిగిపోయిన తర్వాత వాసన చూడండి.
3. అమ్మోనియా వాసన లేకపోతే, అది కల్తీ లేని పంచదార.
4. అమ్మోనియా వాసన వస్తే అది కల్తీ పంచదార.







Untitled Document
Advertisements