ఇంట్లో పూజగది ఎందుకు ఉండాలి?

     Written by : smtv Desk | Fri, Nov 19, 2021, 03:29 PM

ఇంట్లో పూజగది ఎందుకు ఉండాలి?

ఈ సమస్త బ్రహ్మాండానికి బ్రహ్మ యజమాని. ఆ విధంగా చూస్తే మన ఇంటి యజమాని ఆయనే. ప్రతి ఇంట్లోని భగవంతునికి నిలయమైన ప్రార్ధనా గదే ప్రధానగది. భారతీయుల ఇళ్ళలో ప్రార్ధనా మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గదిలో లేదా మందిరంలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజ చేస్తారు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు,పండగలు వంటి ప్రత్యేక సందర్భాలలో పూజలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులంతా పూజా మందిరంలో చేరి ప్రార్ధనలు నిర్వహిస్తారు. ధ్యానానికి, భక్తి ప్రవృత్తులకు, ప్రార్ధనలకు, పవిత్ర, ప్రశాంత వాతావరణాన్ని సృష్టించుకోవాలి. భగవంతుని మీద ఏకాగ్రత, మనసు బాహ్య ప్రపంచంవైపు చలించకుండా, అదుపులో పెట్టుకొనుటకు ఒక ప్రత్యేక పూజగది అవసరం. భగవంతుడే మన ఇంటి అసలు యజమాని అని, ఆయనే తన ఇంటి బాగోగులు చూసుకుంటాడని భావిస్తూ ఇలా పూజగదిని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే భగవంతుని రూపం అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ విషయాన్ని ఆయన మనకి తెలియజెప్తు ఆయన మన ఇంట్లో, మన చెంతే ఉన్నాడని మనసావాచా భావించుకుంటాం. అందువలన ఈ పూజ గదులు వుండాలి. ఆయన కృపలేకుంటే ఏ పని విజయవంతంగా, సులువుగా పూర్తి కాదని తెలుసుకోవాలి. ప్రతిరోజు, ప్రత్యేకసందర్భాలలో మనం పూజగదిలో కూర్చుని ఆయనతో సంభాషించాలి. అప్పుడా పవిత్ర ఆలోచనలు, ధ్వని తరంగాలు ఆ ప్రదేశంలో నిండిపోయి మన మనసుల్ని ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పూజల ద్వారా మనలో గుడు కట్టుకుంటాయి.





Untitled Document
Advertisements