మిరియాలతో ఉపయోగాలు !

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:33 PM

మిరియాలతో ఉపయోగాలు !

మిర్యాలలో యాంటీ బ్యాక్టీరియా గుణాలు అధికము. విటమిన్ సి కూడా విరివిగా లభిస్తుంది. మిర్యాలు శరీరములోని హానిచేసే వ్యర్థాలను బయటకు పంపుతాయి. డయెరియా, మలబద్దకం వంటి సమస్యలున్నప్పుడు కూరలు, సలాడ్లు, సూపులలో మిర్యాల పోడి కలుపుకొని తింటే ఎంతో మేలు జరుగుతుంది.రోగనిరోధక శక్తి పెంచటములో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దగ్గు, జలుబు, వున్నప్పుడు వేడిపాలలో మిర్యాల పొడి వేసుకొని తాగితే తక్షణమే పరిష్కారం దొరుకుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. తరుచు మిర్యాలను తీసుకోవడం ద్వారా జీవక్రియల రేటు మేరుగైతుంది. అనవసర కొవ్వుని కరిగించే పోషకాలు మిర్యాలలో ఎక్కువ బరువు తగ్గలనుకునేవారు రోజు తీసుకునే ఆహారముతో వీటిని చేర్చుకుంటే ఫలితం వుంటుంది.
పొట్టలో ఇన్ఫెక్షన్స్ కడుపుబ్బరం వంటి సమస్యలు మిర్యాల పొడి తీసుకోవడం వలన తగ్గుతాయి. దంతాలకు సంబంధించిన జబ్బులను కుడా మిర్యాలు దూరం చేస్తాయి. ఇలా మిర్యాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.





Untitled Document
Advertisements