దాల్చిన చెక్కతో అధికబరువుని అదుపులో!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:35 PM

దాల్చిన చెక్కతో అధికబరువుని అదుపులో!

దాల్చిన చెక్క చెట్టు యొక్క బెరడు అని అందరికి తెలిసిందే వంటలకే కాకుండ ఆరోగ్యరక్షణలో కూడ దాల్చిన చెక్క ఎంతో ఉపయోగకారి. దాల్చిన చెక్కలో కౌయారిన్ అనే పదార్ధం వుంటుంది. మధుమేహ రోగులకు చెక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. రక్తంలోని గాఢతను తగ్గించే గుణాలు ఇందులో మెండు. ఫలితముగా రక్తప్రసరణ వేగవంతమై జీవక్రియ వేగం పెరుగుతుంది. బరువు తగ్గించటములో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇందులోని యాంటీ బయాటిక్ గుణమువల్ల అల్సర్లు తగ్గుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించి వ్యాధిని తగ్గిస్తుంది. ఇందులో సినియాల్డీ హైడ్, ప్రోజెస్టరాన్, డెస్టెస్టిరాన్ హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల సమస్య కారణంగా సంతానలేమితో బాధపడేవారికి మంచి ఔషధం. ఈ చెక్క వాసన మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది. నరాల వ్యాధులను నియంత్రిస్తుంది. ఈ పొడి టీ రూపంలో తీసుకుంటే జలుబు, జ్వరాలు తగ్గుతాయి. ఈ చెక్క నుండి తీసిన నూనెతో మర్దిస్తే కండరాల నొప్పులు, కీళ్ళనొప్పులు తగ్గుతాయి. పీచు ఖనిజ లవణాలు ఇందులో వుంటాయి. పీచు, క్యాల్షియం కలిసి ప్రేగుల పనితీరు మెరుగుపరుచుతాయి. ప్రేగు క్యాన్సర్ రాకుండ కాపాడుతుంది. హానికరమైన బ్యాక్టీరియాను పెరగనివ్వని గుణాలు ఇందులో వున్నాయి. ఇన్నీ ఉపయోగాలు వున్న దాల్చిన చెక్కను 1/2 చెంచా పొడి వాడుట మంచిది. బరువు తగ్గలనుకునేవారు ఉదయమే 1/2 చెంచా పొడిని నీటిలో కలిపి త్రాగవచ్చు. గంట వరకు ఏమి తినరాదు.


Untitled Document
Advertisements