పుచ్చకాయను ఊబకాయానికి విరుగుడుగా వాడుకోవచ్చు!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:43 PM

పుచ్చకాయను ఊబకాయానికి విరుగుడుగా వాడుకోవచ్చు!

పుచ్చకాయ చూడడానికి ఎర్రగా నల్లటి గింజలతో ఉంటుంది. దీని రుచి మాత్రం అమోఘం. పుచ్చకాయను ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. పైగా పుచ్చకాయలోని పోషకవిలువలు కూడా అధికమే. పుచ్చకాయను నేరుగా తినవచ్చు, జ్యూస్ గా చేసుకుని త్రాగవచ్చు, ఫ్రూట్ సలాడ్స్ లోను చేర్చుకోవచ్చు. అయితే ఈ పుచ్చకాయకు సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.
పుచ్చకాయ అన్ని సీజన్లలో దొరుకుతుంది. నీటి శాతం ఎక్కువగా కలిగి ఉంటుంది. తినడానికి రుచికరంగా ఉంటుంది. అయితే పుచ్చకాయ అని చాలామంది వేసవికాలంలోనే తింటారు, కానీ పుచ్చకాయను అన్ని సీజన్లలో దొరుకుతుంటాయి ఎప్పుడైనా తినవచ్చు. ఊబకాయం పై పోరాడటానికి అర్బనైన్ అనే రసాయనం బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక రకమైన అమినో ఆమ్లం పుచ్చకాయ రసంలో సమృద్ధిగా లభిస్తుంది. ఈ రసాయనం ఒకవైపు మనుషులలో కొవ్వు పేరుకోవడం నివారిస్తూనే మరొకవైపు కండ ఎముకల పుష్టిని బాగా పెంచుతుందని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి పుచ్చకాయ వాడుట వలన వేసవి తాపమే కాకుండా ఊబకాయానికి విరుగుడుగా వాడుకోవచ్చు.





Untitled Document
Advertisements