ఈ ఆకు హై బీపీని అదుపులో ఉంచుతుందట!

     Written by : smtv Desk | Mon, Nov 22, 2021, 12:51 PM

ఈ ఆకు హై బీపీని అదుపులో ఉంచుతుందట!

కరివేపాకు కొంతమంది ఇంటి ఆవరణలోనే పెంచుతారు. దీని ఆకులతో కూరలకు సాంబార్ రుచి ఎంతో పెరుగుతుంది. అందుకే కరివేపాకు తిన్నా, తినకున్నా సరే కూరలలో కచ్చితంగా వాడుతూ ఉంటారు. దీని ఉపయోగాలు తెలిసినా కూడా కొంత మంది దానిని తినకుండా పక్కన పెడుతున్నారు. కానీ పచ్చి ఆకుని తిన్న కూడా ఉపయోగం ఉంటుంది కరివేపాకులో ఔషధ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కరివేపాకు తో పచ్చడి చేస్తారు. పొడి తయారు చేసుకొని కూడా వాడతారు. కరివేపాకు హై బీపీని అదుపులో ఉంచుతుంది.
ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం
* 50 గ్రాములు కరివేపాకు దంచి మజ్జిగలో పరగడుపున తాగితే జిగట విరేచనాలు రక్త విరేచనాలు తగ్గిస్తుంది.
* 50 గ్రాములు కరివేపాకు మెత్తగా దంచి మజ్జిగలో కలిపి పరగడుపున తాగితే అల్సర్లను బాగా తగ్గిస్తుంది.
* లేత కరివేపాకు తేనెతో కలిపి తింటే మంచి విరేచనకారి హర్ష మొలలకు మంచి మందుగా పనిచేస్తుంది.
* కరివేపాకు నీడలో ఆరబెట్టి పొడి చేసి ఉదయం, సాయంకాలం ఒకటి స్పూన్ పొడి తీసుకుని నీటిలో కలిపి తాగితే అర్షమొలలు తగ్గుతాయి.
* కరివేపాకు కాయకు నిమ్మరసం కలిపి దంచి విషం తాగిన వారికి నీటిలో కలిపి తాగిస్తే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* పది, పదిహేను కరివేపాకులు పరగడుపున నమిలి మింగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* కరివేపాకు తీసుకుంటే అజీర్ణం దూరం చేస్తుంది.
* కరివేపాకు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
* కరివేపాకు దంచి గజ్జిపై పెడితే గజ్జి తగ్గుతుంది.
* కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి చల్లార్చిన తర్వాత వడకట్టి రోజూ తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.
* కరివేపాకు పొడి తింటే డీసెంట్రీ, డయేరియా తగ్గుతుంది.
* కరివేపాకు తినడం వల్ల కంటి చూపు కూడా చక్కగా ఉంటుంది.
* కరివేపాకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.





Untitled Document
Advertisements