చిన్నారులపై ఆగని మృగాళ్లు అకృత్యాలు...బాలికపై కామాంధుడి కీచకపర్వం

     Written by : smtv Desk | Wed, Nov 24, 2021, 08:02 PM

చిన్నారులపై ఆగని మృగాళ్లు అకృత్యాలు...బాలికపై కామాంధుడి కీచకపర్వం

అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై నీచుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్(27) కూలీ పనులకు వెళ్తుండేవాడు. అతని ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి రోజూ ఆడుకునేందుకు వచ్చేది. అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేసిన కామపిశాచి ఈ నెల 18న ఎవరూలేని సమయం చూసి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి నీచానికి పాల్పడ్డాడు.

ఇంటికి వచ్చిన చిన్నారి విషయం కుటుంబ సభ్యులకు చెప్పినా వవారం రోజులపాటు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టేశారు. నాలుగు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న రమేష్ ఇంటికి రావడంతో చిన్నారి కుటుంబ సభ్యులు చితకబాదారు. గ్రామస్తులు ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

Untitled Document
Advertisements