జన్ ధన్ స్కీమ్...ఖాతా తెరిస్తే రూ. 10 వేల లాభం

     Written by : smtv Desk | Fri, Nov 26, 2021, 06:14 PM

జన్ ధన్ స్కీమ్...ఖాతా తెరిస్తే రూ. 10 వేల లాభం

కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన పథకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఉచితంగానే బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఇంకా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

రూ.2 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా బెనిఫిట్ కలిగిన ఈ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీరు మినిమమ్ బ్యాలెన్స్ కూడా కలిగి ఉండాల్సిన పని లేదు. ఎలాంటి చార్జీలు పడవు. అలాగే ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డుపైనే ఉచిత ఇన్సూరెన్స్ ఉంటుంది.

ఇవేకాకుండా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఇది కూడా రుణం మాదిరి అని చెప్పుకోవచ్చు. రూ.10 వేల వరకు (ఇది వరకు రూ.5 వేలు ఉండేది) ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంది. మీరు మీ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా ఈ బెనిఫిట్ పొందొచ్చు. అయితే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి అకౌంట్‌పై ఈ బెనిఫిట్ ఉందో లేదో తెలుసుకోవచ్చు.

Untitled Document
Advertisements