చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

     Written by : smtv Desk | Fri, Dec 03, 2021, 01:15 PM

చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

చలికాలంలో చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
✤ విపరీతమైన చలి కారణంగా ఉదయం లేవగానే చర్మం పొడిగా మారుతుంది. దానికి రాత్రివేళ నిద్రపోయే ముందే చర్మానికి పగుళ్ల నివారణ క్రీములు రాసుకుంటే మంచిది.
✤ నీరు తాగండి: చ‌లి కాలంలో నీరు తాగాల‌ని అనిపించ‌దు. దాంతో నీరు తాగడం మర్చిపోతాం. కానీ, క్ర‌మం త‌ప్ప‌కుండా నీరు తాగాలి. నీరు తీసుకోవ‌డం ద్వారా చ‌ర్మ పొడిబారిపోవ‌డం త‌గ్గిపోతుంది. కావాలంటే మీరు రెగ్యులర్‌గా నీరు తాగి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
✤ మాయిశ్చరైజర్ మార్చండి: మీరు సమ్మర్‌ లేదా వానాకాలంలో వాడే మాయిశ్చరైజర్ ఇప్పుడు పనికి రాదు. ఇంకా రిచ్‌గా, ఆయిల్ బేస్‌గా ఉండే మాయిశ్చరైజర్ తీసుకోండి. వీలున్నంత వరకూ ఆర్గానిక్ ప్రొడక్టులు వాడడం మంచిది.
✤ హ్యుమిడిఫైయర్ తీసుకోండి: వింటర్‌లో హ్యుమిడిటీ తక్కువగా ఉంటుంది. అందుకే ఒక హ్యుమిడిఫైయర్‌ను ఇంట్లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.
✤ కూరగాయలు తినండి: యాంటీ ఆక్సిడెంట్ ఉన్న కూర‌గాయ‌ల‌ను తీసుకోండి. చిలగడదుంపలు, క్యారెట్స్, క్యాప్సికం, గుమ్మడికాయ వంటి వాంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్స్ ఏ, బీ, ఈ, ఐరన్ ఉంటాయి.
✤ ఒమేగా-3: మీ చేతులు మెత్తగా మృదువుగా లేవంటే మీకు ఒమేగా 3 సరిపడినంత లేదని కూడా సూచన కావచ్చు. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్‌లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.
✤ ర‌సాయ‌నాల‌తో కూడిన స‌బ్బులు వాడ‌కండి: శ‌రీరంలో చ‌ర్మం అతి పెద్ద అవయవం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆల్కహాల్, ఫ్రాగ్రెన్స్ , ర‌సాయ‌నాలు ఉన్న సబ్బుల‌ను వాడ‌కండి. ఇవి చర్మం మీద సహజంగా ఉండే నూనెలను తీసేస్తాయి.
✤ గోరు వెచ్చని నీరే మంచిది: ఈ కాలంలో వేడి నీటి స్నానం వల్ల హాయిగా ఉంటుంది కానీ, స్కిన్‌కు మాత్రం అది హాని చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి.
✤ కొబ్బరి నూనె: కొబ్బరి నూనె స్కిన్ కేర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. స్కిన్ యంగ్‌గా కనిపించేలా చేస్తుంది.
✤ దానిమ్మ పండు: దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ ఏజీయింగ్‌ను అడ్డుకుంటాయని పరిశోధనల్లో తెలిసింది. దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే.





Untitled Document
Advertisements