లివర్ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:32 PM

లివర్  ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్ ని మనం కాపాడుకోగలిగితే అది మనల్ని కాపాడుతుందని వైద్యులు అంటారు. జబ్బులు రాకుండా లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్చమైన గాలి, మంచినీరు, పోషకాహారం అవసరం. మనిషి శరీరంలో అతి కీలకమైనది రక్తం. దాన్ని ప్రోసెసింగ్ లివర్ లోనే జరుగుతుంది. రసధాతువు (ఫ్లాస్మా) రక్తంగా మారడం లివర్ వల్లనే జరుగుతుంది. లివర్ బాగుండటానికి మొదట ఆహారంపై శ్రద్ధ తీసుకోవాలి. ధాన్యాలు, కూరగాయలు, ఫలాలు తినాలి. స్వచ్చమైన గాలిని పీల్చగలగాలి. ఒక్కోసారి లివర్ సమస్య రావచ్చు. గాల్ స్టోన్స్ ఏర్పడి చైల్ డక్ట్ లో అవరోధం రావడం లివర్ ఎన్లార్జ్మెంటు కామెర్లు రావడం సంభవం. అలాంటి పరిస్థితిలో మందులతోపాటుగా రోగి తన తిండి విషయంలో నియమాలు విధిగా పాటించాలి. అలా పాటిస్తేనే మళ్ళీ లివర్ యధావిధిగా పనిచేస్తుంది.
* కూరగాయలతో సూపు తయారుచేసుకోవడం దానికి కొద్దిగా ద్రాక్ష లేదా దానిమ్మ గింజలు కలిపి తింటే ఇంకా బాగుంటుంది.
* గంజి అన్నం ఏ పచ్చడితోనో నంజుకొని తింటే ఇంకా బాగా ఉంటుంది.
* రోగికి ఇవ్వవలసిన ఆహారాన్ని శుశ్రుత సంహితలో ఇలా చెప్పారు. ఏడాది పాత బియ్యం, తాజా ఫలాలు, పండిన ఫలాలు, తాజా కూరగాయలు, ఎర్ర బియ్యం, గోధుమలు, ఆవుపాలు, ఆవు నెయ్యి, సైంధవ లవణం వాడకం మంచిది.
* లివర్ జబ్బులు నివారణకు ఆపిల్స్, ఉసిరి, ద్రాక్ష, మామిడి, పచ్చి బొప్పాయి వాడవచ్చును.
* క్యారెట్టు, బీర, క్యాబేజీ, పొట్లకాయ, మెంతికూర, కొత్తిమీర మొదలగు ఆకు కూరలు వాడాలి.
* తేలికైన ఆహారం, జీర్ణం కాగల ఆహారాన్ని మాత్రమె తీసుకొవాలి.





Untitled Document
Advertisements