కుంకుమ పువ్వు డిప్రెషన్ ను తగ్గిస్తుంది!

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:33 PM

కుంకుమ పువ్వు  డిప్రెషన్ ను తగ్గిస్తుంది!

సాధారణంగా కుంకుమపువ్వుని గర్భం ధరించిన స్త్రీలు మాత్రమే పుట్టబోయే బిడ్డ మంచి రంగు రావాలని వాడుతుంటారు అనుకుంటారు. అలాగే స్వీట్ల తయారీలో అలంకరణ కోసం వాడుతారు అనుకుంటారు. కాని ఎన్నో రకాల ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉన్న ఈ కుంకుమ పువ్వుని ఎవరైనా సరే వాడొచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకి కుంకుమ పువ్వులో ఎలాంటి ఆరోగ్యప్రయోజానాలు ఉన్నాయో చూసేద్దాం..
* ఒక కిలో కుంకుమపువ్వు కాయాలంటే రెండు లక్షల పువ్వులు అవసరం కాబట్టే ధర అధికంగా ఉంటుంది. చెదు కలిసిన తియ్యదనంతో ఉండే కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరచి, రక్తపోటును తగ్గిస్తుంది.
* చైనీయులు వైద్యంలో కాలేయ సామర్ధ్యాన్ని పెంచేందుకు కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు.
* ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగిస్తారు.
* ఆకలిని క్రమబద్దీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్ సమస్యల చికిత్సకు కుంకుమ పువ్వును వాడతారు.
* దగ్గు, కడుపుబ్బరం చికిత్సకు కుంకుమ పువ్వును వాడతారు.
* శారీరక రుగ్మతలతోపాటు డిప్రెషన్ ను కూడా కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.
మరి ఇన్నిరకాల ఆరోగ్యప్రయోజనాలున్న కుంకుమపువ్వుని మనం వాడేద్దాం.





Untitled Document
Advertisements