అరటిపండుతో ఆరోగ్యం!

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:34 PM

అరటిపండుతో ఆరోగ్యం!

అరటిపండు తినడం తేలిక. ధర తక్కువ, ఎక్కడికైనా వెంట తీసుకెళ్లడం తేలిక. ఆకలివేసినప్పుడు తినడానికి అందుబాటులో ఆహరం లేనప్పుడు రెండు అరటిపళ్ళు తింటే కడుపు నిండుతుంది. పైగా ఆకలి తీరుతుంది. మరి అటువంటి అరటిపండు మన ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
* ప్రతిరోజు భోజనం ముగించిన వెంటనే అరటిపండు తింటే వీర్యవృద్ది కలుగుతుంది. కామశక్తి పెరుగుతుంది.
* అరటిపండు తిని ఆ తర్వాత ఓ గ్లాసు పాలల్లో ఒక చెంచా నెయ్యి, కాసింత యాలకుల పొడి కలుపుకొని నిత్యం సేవిస్తుంటే శరీరం బలిష్టంగా మారి, వీర్యవృద్ది, మేధో సంపత్తి పెరుగుతుందట.
* జబ్బులతో బాధపడే స్త్రీలకు అరటిపండు ఓ దివ్య ఔషధం.
* ప్రతిరోజు రెండు అరటిపండ్లు తింటే శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, క్యాలరీలు లభిస్తాయి. సన్నగా ఉన్నవారు బరువు కూడా పెరుగుతారు.
* ప్రతిరోజు అరటిపండు తింటే బ్రేక్ఫాస్ట్ లో వేడి పాలను త్రాగితే నిత్య యవ్వనులుగా ఉంటారని వైద్యులంటున్నారు.
* అరటిపండు తొక్కపైన చుక్కలు ఉన్న పండును తింటే ఆరోగ్యానికి మరి మంచిది.
* జీర్ణక్రియ బాగుండాలి అంటే ప్రతిరోజు మీ బ్రేక్ఫాస్ట్ లో రెండు అరటిపళ్ళు తప్పక తినాలి.





Untitled Document
Advertisements