ముల్లంగిలోని హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ముల్లంగిని వద్దు అనకుండా తినేస్తారు!

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:35 PM

ముల్లంగిలోని హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ముల్లంగిని వద్దు అనకుండా తినేస్తారు!

వగరుగా కొద్దిగా కారంగా ఉండే ముల్లంగి అంటే తెలియనివారు ఎవరుంటారు? ఇందులో పిండిపదార్థాలు పెద్దగా ఉండవు. కొవ్వు శాతమూ తక్కువే! మేలు చేసే పీచుపదార్థాలు, తేమ మాత్రం పుష్కలం. ఇందులోని ఘాటైన నూనెలు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సాయపడతాయి. ముల్లంగిని పచ్చిగానే తీసుకోవడం మంచిది.
* ముల్లంగిని ఇతర కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకుంటే పైల్స్, అజీర్ణం, మలబద్దకం వంటివిరావు.
* ఓ చెంచా ముల్లంగి రసంలో చెంచా తేనే, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* ఎ, సి, విటమిన్లు, పొటాషియం, ఇనుములాంటి ఖనిజాలు అధికంగా ఉండే ముల్లంగి ఆకులతో కషాయం కాచి చిటికెడు నిమ్మరసం కలిపి తాగితే మూత్రాశయ సంభందిత మంట తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉన్నవారు ఇతర ఆకుకూరలతో కలిపి దీనిని వండి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* అధికబరువు, చెక్కరవ్యాధి ఉన్నవారు ముల్లంగికూర తింటే కడుపు నిండిపోతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
* అలాగే ముల్లంగి గింజలను నీటిలో నానబెట్టి గుజ్జుగా చేసి శరీరంపై రాస్తే గజ్జిపోక్కులు తగ్గుతాయి.
* ముల్లంగి గింజలను పొడి చేసి నీళ్ళలో చిటికెడు పొడి కలిపి తాగితే కడుపులోని పురుగులు చనిపోతాయి.





Untitled Document
Advertisements