అలోవేరా రసాన్ని ఇలా తీసుకుంటే గుండె దడ తగ్గుతుందట!

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:36 PM

అలోవేరా రసాన్ని ఇలా తీసుకుంటే గుండె దడ తగ్గుతుందట!

అలోవేరా అందానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకారి అనే విష్యం మనకు తెసిందే అయినప్పటికీ అలోవేరాని ఎలా తీసుకొవాలి అనేది మనకు ఏమాత్రం స్పష్టత లేని విషయం.అయితే ఆరోగ్యం కోసం అలోవేరాని ఎలా తీసుకుంటే మనకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
* అలోవేర ఆకును నిలువుగా మధ్యకు చీల్చి పులిపిరి ఉన్న చోట పైన్బ కట్టుగా కడితే పులిపిరి కాయలు రాలిపోతాయి.
* అలోవేర రసం మరియు పంచదార కలిపి తీసుకుంటే గుండె దడ తగ్గుతుంది.
* అలోవేర రసం రెండు చెంచాలు మరియు తేనే ఒక చెంచా కలిపి త్రాగితే మూత్ర విసర్జనలో కలిగే నొప్పి తగ్గుతుంది.
* అలోవేర రసానికి జీలకర్ర పొడిని కలిపి మెత్తగా నూరి చీము పట్టిన గడ్డల మీద లేపనం వేస్తె గడ్డ పగిలి చీము కారిపోయి ఉపశమనం కలుగుతుంది.
* సెగగడ్డ త్వరగా పక్వం చెందటానికి అలోవేర మట్టను నిలువుగా చీల్చి లోపలి గుజ్జును గీరేసి, కేవలం ఆకు వెలుపలి పొరను, గుజ్జువైపు సెగగడ్డకు ఆనించి కట్టుకోవాలి. అలోవేరా రసాన్ని నవ్యం రూపంలో పీలిస్తే కామెర వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.
* అలోవేరా వేరుకు పసుపు కలిపి రొమ్ము మీద ప్రయోగిస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలోవేరా జ్యూసును పండ్ల రసానికి కలిపి తీసుకోవచ్చు.





Untitled Document
Advertisements