పోపుల పెట్టెలోనే ఆరోగ్యం !

     Written by : smtv Desk | Thu, Dec 09, 2021, 07:38 PM

పోపుల పెట్టెలోనే ఆరోగ్యం !

మనం నిత్యం వంటగదిలో చూసే పోపుల పెట్టేలోని దినుసుల్లో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసు..ప్రతి చిన్న అనారోగ్యానికి టాబ్లెట్స్ మీద ఆధారపడకుండా వంటగదిలోని వస్తువులతో చిట్కా వైద్యం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవడంతో పాటు డబ్బుని ఆదా చేసుకోవచ్చు. అయితే పోపులపెట్టేలోని ఏ వస్తువులతో ఎలాంటి చిట్కా వైద్యం చేయవచ్చు అనేది ఇప్పుడు ,మనం తెలుసుకుందాం.
* ఆవాలు, ఉప్పు, పట్టిక సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి దానితో పండ్లు తోముకుంటే, పండ్లు కదలడం, రక్తం కారడం, చిగుళ్ళు వాపులు తగ్గుతాయి.
* జీలకర్రను మెత్తగా నూరిన చూర్ణాన్ని, ,మెత్తగా నూరిన పంచదార ఒక స్పూను రెండు కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే ముక్కు వెంట పడే రక్తం ఆగిపోతుంది.
* ఒక స్పూను మెంతులు, పది పచ్చి కరివేపాకులు కలిపి నూరి పెరుగులో కలుపుకుని తింటే అజీర్ణ విరేచనాలు, నీళ్ళవిరేచనాలు, బంకవిరేచనాలు తగ్గిపోతాయి.
* అల్లం, జీలకర్ర సమభాగాలుగా కలిపి నీటిలో వేయించి ప్రొద్దున్నే కుంకుడుకాయ ప్రమాణంలో తీసుకుంటే కడుపునొప్పి వెంటనే తగ్గిపోతుంది.
* ధనియాలు, శొంటి, జీలకర్ర సమభాగాలుగా తీసుకొని మెత్తగా నూరి ఆ ఉండను నీళ్ళలో వేసి బాగా కషాయం కాచి రాత్రి పడుకోబోయే ముందు అర టీస్పూన్ త్రాగితే ఉదయం సాఫీగా విరేచనం అవుతుంది.
* పక్షవాతం, వాతం వాళ్ళ వచ్చే మోకాళ్ళ నొప్పులకు మిరపకాయలు, నువ్వుల నూనే కలిపి దంచి ఆ మిశ్రమాన్ని రాస్తే నొప్పులు త్వరగా తగ్గిపోతాయి.
* స్త్రీలు ప్రసవించినప్పుడు ఇంగువను కొద్ది మోతాదులో తినిపిస్తే మైలరక్తం బాగా జారీ గర్భకోశం శుభ్రపడుతుంది.
* ఆహారంలో వెల్లుల్లి రోజు తీసుకోవడం వలన వెంట్రుకలు త్వరగా తెల్లబడకుండా ఉంటాయి. బాలింతలకు పాలు ఎక్కువగా పడతాయి.
* పసుపును వీలైనంత వరకు అన్ని వంటకాల్లోనూ రంగుకు మరియు నిల్వకు వాడుతుంటారు. పసుపు క్యాన్సర్ నివారిణి పైగా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అందానికి, ఆరోగ్యానికి పనికి వచ్చే పసుపు వంటల రాణిగా పేరును సంపాదించుకుంది. వేదేశీమారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతుంది.
* శనగపప్పు రుచిని పెంచి, గమ్మతైన వాసనతో కరకరలాడే శనగపప్పుతో సున్నిపిండి చేస్తారు. సున్నిపిండి ముఖవచ్చస్సు పెంచి, కళాకాంతుల్ని అందిస్తుంది.
* కొబ్బరి తురుము కొబ్బరిపాలు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీర చర్మకాంతి పెంపొందిస్తుంది.
* కొబ్బరి పలు తలకు పట్టించి తలస్నానం చేయడం వలన కురులు అందంగా పెరిగి నల్లగా ఆరోగ్యవంతంగా ఒత్తుగా ఉంటాయి.





Untitled Document
Advertisements