అందమైన అధరాల కోసం ఇలా చేయండి !

     Written by : smtv Desk | Sat, Dec 11, 2021, 12:16 PM

అందమైన అధరాల కోసం ఇలా చేయండి !

సున్నితమైన పెదవులకు దాదాపుగా అన్ని కాలాలు పరీక్ష పెడుతుంటాయి. వాటి సంరక్షణకు వాతావరణానికి అనుగుణంగా తీసుకునే శ్రద్ధతో పాటు రెగ్యులర్ గా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటుంటే అందమైన అధరాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంట్లో దొరికే వస్తువులతో చిన్నచిన్న చిట్కాలు పాటిస్తూ పెదవులని ఎలా ఆకర్షణీయంగా తీర్చిద్దిద్దుకోవచ్చు అనేది తెలుసుకుందాం..
* ఒక టీస్పూన్ మీగడలో అంతే మోతాదులో క్యారట్ జ్యూస్ కలిపి పెదవులకు పట్టించి ఐదు నుంచి పదినిమిషాల సేపు మర్దన చేయాలి.
* పెదాలు కాంతి హీనంగా ఉన్నా, నల్లగా ఉన్నా.. ప్రతిరోజూ ఉదయం ఒక బీట్ రూట్ ముక్క తీసుకుని మృదువుగా పెదాలకు రుద్దండి.
* తేనెను పెదాలకు రాసుకుని కొన్ని నిమిషాల తరువాత కడిగేయాలి. తేనే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేసి పెదాలను మృదువుగా ఉంచుతుంది.
* కొబ్బరి నూనె, బాదం నూనెను సమపాళ్ళలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి రాత్రంతా ఉంచాలి. ఇలా ప్రతిరోజూ రెండు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* పెదాలకు సహజమైన గులాబీ రంగు రావాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు బీట్రూట్ రసం రాస్తే సరిపోతుంది.
*పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడిచేసుకొవద్దు. అలా చేయడం వలన తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. కాని తడి ఆరిన తర్వాత నొప్పి ఎక్కువ అవుతుంది.
* కాలం ఏదైనా సరే రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
*పెదవులకు కలబంద రసాన్ని పూయడం వలన కూడా మంచి ప్రయోజనం వుంటుంది.
* కీరా ముక్కను పెదాలపై రాయడం వాళ్ళ పెదాలు మృదువుగా ఉంటాయి.
*రాత్రుళ్ళు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాయడం వల్ల ఉదయానికి పెదాలు మృదువుగా మెరుస్తూ కనిపిస్తాయి.
* మార్కెట్ లో దొరికే టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై నాలుగైదు నిమిషాలసేపు ఉంచడం వల్ల పెదాలకు కావాల్సిన తేమ ఏర్పడి నిగారింపు వస్తుంది.
*విటమిన్ ఎ, బి, సి, బీ2, ఇ లోపాల వల్ల కూడా పెదాలు చిట్లిపోతాయి. కాబట్టి ఈ విటమిన్లు దొరికే కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది.
* రెండు కుంకుమ పువ్వు రెక్కల్ని పెరుగులో కలపాలి. ఈ పెరుగును రోజుకు రెండు మూడు సార్లు పెదవులకు రాసుకుంటే మంచి రంగులోకి మారతాయి.
* వారానికి ఒకసారి పెదవులపై టూత్ బ్రెష్ తో పెదవులపై రుద్దితే అక్కడ మృత చర్మం తొలగిపోతుంది.
* కొబ్బరినూనె మరియు బాదం నూనె సమపాళ్ళలో తీసుకుని పొడిబారిన పెదవులకి రాస్తే తేమగా తయారవుతాయి.





Untitled Document
Advertisements