ఇంట్లోనే ఫేషియల్ చేసుకొండిలా..

     Written by : smtv Desk | Sat, Dec 11, 2021, 12:27 PM

 ఇంట్లోనే ఫేషియల్ చేసుకొండిలా..

అందంగా కనిపించాలి అని ఎవరికీ మాత్రం వుండదు. అందుకోసం మనం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడుతూ, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం రెండు వృధా చేసుకున్నప్పటికీ అలా సొంతం చేసుకున్న అందం తాత్కాలికమే. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతో కాస్త సమయాన్ని వెచ్చించి ఎప్పటికి నిగనిగలాడుతూ మెరిసిపోయే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఒక క్యారెట్, కీరా చిన్న ముక్క తీసుకుని పేస్టూలా చేయాలి. దీనికి అర చెంచా తేనె, రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు కలపాలి. ఈ పేస్టును ముఖంపై, మెడపై రాయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి.
* కొంచెం కుంకుమపువ్వును తీసుకుని దానిని కొంచెం వేడినీటిలో వేసి రెండు గంటల తరువాత ఆ మిశ్రమాన్ని కాటన్ తో ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన స్కిన్ నిగనిగలాడుతుంది.
* కొంచం పసుపులో పెరుగు కలిపి దానిని ముఖానికి మర్దనా చేసి 20 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
* పిండేసిన నిమ్మచెక్కలను పెరుగులో ముంచి స్కిన్ మీద రాసుకున్నా ముఖం మీద పేరుకుని ఉన్న మట్టి తొలగిపోతుంది.
* టమాటా గుజ్జును ముఖానికి మర్దనా చేసి 20 నిమిషాలు ఆరిన తరువాత కడిగేయాలి. ఇది బ్లీచ్ లాగా ఉపయోగపడటమే కాకుండా టమాటా ముఖానికి ఉన్న ఆయిలీనెస్ తగ్గిస్తుంది.
* నిమ్మరసం, దోస రసాన్ని సమపాళ్ళలో తీసుకుని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి
* దోస, బొప్పాయి గుజ్జులో కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం బాగా కలిపి దానిని ముఖానికి చేతులకు, కాళ్ళకు బాగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరానికి ఉన్న మట్టి తొలగిపోతుంది.
* ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ముల్తానా మట్టికి రోజ్ వాటర్, నిమ్మరసం జత చేసి ఆ మిశ్రమాన్ని రోజు ముఖానికి రాసి ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
* బాదం పలుకుల పొడిని పెరుగుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మర్దనా చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.







Untitled Document
Advertisements