క్యాబేజీతో అందం, ఆరోగ్యం మీసొంతం!

     Written by : smtv Desk | Mon, Dec 13, 2021, 03:52 PM

క్యాబేజీతో అందం, ఆరోగ్యం మీసొంతం!

క్యాబేజీ అనగానే చాలామంది వాక్ మేము తినలేము మా వల్ల కాదు అంటారు. పైగా క్యాబేజీని ఉడికించేటప్పుడు వచ్చే వాసన కూడా అదో మాదిరిగా ఉంటుంది. అయితే క్యాబీజీ అంటే వాక్ అనేవారు కూడా క్యాబేజీ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి కనుక తెలుసుకుంటే వద్దు అన్న తినడం మానరు.. ఇంతకి క్యాబేజీ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
* క్యాబేజీ రోగానిరోధిని సౌందర్యధాయిని. ప్రతిరోజు సలాడ్ రూపంలో తింటుంటే వృద్దాప్య లక్షణాలు త్వరగా రావు అని అంటారు. ప్రకృతి వైద్యులు, క్యాబేజీ రసం జీర్ణకోశంలో ఏర్పడే పుండ్లని నిరోధిస్తుంది.
* పచ్చి క్యాబేజీ రసాన్ని ముఖానికి రాసుకుంటే ముడతలు తగ్గి, చర్మం పొడిబారకుండా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
* క్యాబేజీని ఉడికించగా వచ్చిన నీటిలో మూఖాన్ని కడుక్కుంటే, ముఖ సౌందర్యంతో విలసిల్లుతారు. పచ్చి క్యాబేజీని మెత్తగా రుబ్బి ఆ రసాన్ని రోజు రెండు మూడు మార్లు త్రాగితే అందులో వుండే విటమిను 'యు' అల్సర్లని తొలగిస్తుంది.
* ప్రతి రెండు, మూడు రోజులకూ ఒక్కసారి క్యాబేజీని కూరగా, వివిధ రూపాల్లో ఆహారంలో చేర్చి, భుజించడం వల్ల మలబద్దకం ఉండదు.
* క్యాబెజీలో అన్ని విటమిన్లు వున్నాయి. కడుపులోని అన్ని రకాల పుండ్లకి, ప్రేగు పూతకి చక్కటి మందు క్యాబేజీ జ్యూస్.
* క్యాబేజీ ఆకు రసం సేవిస్తే, చర్మంపైన ఏర్పడే బొబ్బలు మచ్చలు నివారించబడతాయి. ఎర్ర క్యాబేజీ రసం దీర్ఘకాలపు దగ్గును, బ్రాంకాయిటీస్ ఆస్తమాకు మంచి టానిక్. క్యాబేజీని తురిమి ఆ గుజ్జును వాపులపై పెట్టి కట్టుకడితే మంచి మందుగా పని చేస్తుంది.
* క్యాబెజీలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఫంగస్ గుణాలు ఉన్నాయి. క్యాబెజీలో A,B,C విటమిన్లు రెబోఫ్లివిన్, కెరోటిన్, ఐరన్, సల్ఫర్, క్యాల్షియమ్, ఫాస్పరస్ ఉన్నాయి.
* ముఖంపై మడతలున్నవారు క్యాబేజీ రసాన్ని ముఖానికి పట్టించి, కొంత సమయము తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడుక్కుంటే, ముఖంపైన ముడతలు పోయి, ముఖవర్చస్సుతో నూతనంగా కనబడుతుంది.
* కూరగాయలు అన్ని చేర్చి , క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, ఉప్పు, కారం, మైదాపిండిని కలిపి ముద్దలుగా చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి తింటే రుచికిరుచి, పోషక విలువలు లభిస్తాయి. ఇదో వెరైటీ వంటకంగా సాయంత్రం పూట తినే అల్పాహారంగా తీసుకుని ఒక కప్పు టీ తాగితే చాలు కడుపు నిండుగా ఉంటుంది.





Untitled Document
Advertisements