శక్తిని అందించే పుదీనా !

     Written by : smtv Desk | Mon, Dec 13, 2021, 03:52 PM

శక్తిని అందించే పుదీనా !

ఆహార పదార్థాలకు మంచి వాసనని, చక్కని రుచిని చేకూర్చుతుంది పుదీనా. పదార్థాలకు నోరూరించే ఘుమఘుమల్ని చేకుర్చేశక్తి దీనికి ఉంది. తీపి, కారం, చల్లని, వేడి పదార్థాలకు వేటికైనా దీనిని జత కలుపుకోవచ్చు. ప్రత్యేకంగా పుదీనా ఆకుతో పచ్చడి తయారుచేసుకోవచ్చు. లేదా కూరలలో కలగలుపుగా వాడుకోవచ్చు. ఎన్నో రకాల పిండివంటలలో, టిఫిన్లలో జతచేయవచ్చు. పుదీనాను వేటికి జతకలిపినా ప్రత్యేక రుచి, సువాసనలు చేకురుతాయి.
పుదీనా ఎవరైనా కొనగల చౌకధరలో లభిస్తుంది. సమోసాలు, పకోడీలు వంటివాటికి సరిజోడైన పచ్చడితయారికి అనువైనది. పుదీనాలో శరీరానికి సత్తువ కలిగించే గుణాలు వున్నాయి. చలవదనాన్ని అందిస్తుంది. గ్లాసుడు మజ్జిగలో ఈ ఔషధాల ఆకును జల్లుకుని తాగితే ఎంతో మేలుచేస్తుంది.
మండేఎండలో పచ్చిమామిడికాయ రసానికి పుదీనా ఆకు కలిపి తాగితే శారీరం చల్లగా సేదతీరుతుంది. ఉదయంవేళ తాగే టీలో ఓ పుదీనా రెమ్మ వేసుకుని తాగితే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.
ముఖ్యంగా బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ చేసి వచ్చిన తర్వాత ఆ మార్పు మరింత కనిపిస్తుంది.
పుదీనాలోని ఔషధవిలువలకు ప్రాచీనకాలం నుంచి గుర్తింపు ఉంది. రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది. రక్త సాంద్రతను తగ్గిస్తుంది.
విపరీతమైన జలుబు వేధిస్తుంటే పుదీనా వేసుకుని తయారుచేసిన టీని ఓ ఫ్లాస్క్లో పోసుకుని మధ్యమధ్యలో తాగుతుంటే రిలీఫ్ గా ఉంటుంది.
జీర్ణక్రియను ఉద్దీప్తం చేసి, వికారాన్ని తగ్గిస్తుంది. కడుపులో మంటకు పుదీనా మంచి మందు అన్నది అమ్మమ్మల కాలంనాటి నుంచి గల చిట్కావైద్యం. నీటిలో పుదీనా వేసి కాచి చలార్చితాగితే ఉపశమనం కలుగుతుంది.
పుదీనా డికాషన్ గొంతునోప్పికి చక్కని మందు.
చాలా మౌత్ ఫ్రెష్నర్లను పుదీనాతో తయారుచేస్తారు. ఇవి రుచినే కాక తాజాదనాన్ని ఇస్తాయి.
పుదీనా ఎన్నో రూపాల్లో ఎల్లవేళలా లభ్యమవుతుంది. తాజా ఆకురూపంలో, ఎందు ఆకురూపంలో, రసంగా, ఆయిల్ గా లభ్యమవుతుంది. వీటి రూపాల మధ్య సూక్ష్మవ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఒక్కదాన్నీప్రత్యేక పద్దతిలో ఉపయోగించడం వల్ల సరైన రుచి చేకూరుతుంది.





Untitled Document
Advertisements