మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు!

     Written by : smtv Desk | Mon, Dec 13, 2021, 03:56 PM

మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు!

మొలకలకు పెసలు, సజ్జలు, రాగులు, బొబ్బర్లు, కందులు, గోధుమలు, శెనగలు వంటి ధాన్యాలను ఉపయోగించవచ్చు. ఈ దాన్యాన్ని మొలకలుగా చేయడం వలన వాటిలో వున్న శక్తి కంటే 8 రెట్ల శక్తి పెరుగుతుంది. ఒక మనిషికి పిరికెడు గింజలు నానబెట్టి మొలకలుగా మార్చిన విత్తనాలు సరిపోతాయి. ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం గుడ్డలో కట్టి రెండు రోజులపాటు ఉంచాలి. మధ్యలో నీరు చల్లాలి. గుడ్డలో కట్టిన మొలకలు అర అంగుళం వరకు పెరగాలి అప్పుడు తినవచ్చు. మొదట్లో కొందరు మొలకలని తినలేరు. అలంటి వారు మొలకలలో ఖర్జూరాలు కలుపుకుని తినవచ్చు. మొలకెత్తిన గింజలలో పోషకాలు సమృద్దిగా వుంటాయి. వాటి ద్వారా పోషకాలు మన శరీరానికి అత్యంత సులువుగా అందుతాయి. ఎలాగంటే మాంసకృత్తులు, అమినోయాసిడ్లుగా, ఫ్యాటీ యాసిడ్లుగా స్టార్చ్ ద్వారా పంచదార తేలికగా అందుతాయి. జీర్ణశక్తి మరింత వేగంగా జరుగుతుంది. దీనిని సులువుగా జీర్ణమయ్యే ఆహారంగా పరిగణిస్తారు. మాంసకృత్తులు, విటమిన్లు, ఎంజైములు, ఖనిజ లవణములు, ఫ్రెష్ మినరల్స్ 300 నుండి 1200 వరకు అధికమౌతాయి. జీర్ణక్రియకు ఆటంకం కలిగించే పలు ఆమ్లాలు విషతుల్యమైన పదార్థాలు చాలా వరకు తగ్గిస్తాయి. మొలకెత్తిన గింజల్లో నీటి శాతం పెరుగుతుంది. కావున అన్ని వయసుల వారు నిరభ్యంతరంగా మొలకలు తినవచ్చు. పల్లీలు, సోయాబీన్స్ లో కొవ్వు శాతం ఎక్కువ వుంటుంది. కావున ఎక్కువ బరువు వున్నవారు, షుగర్ వున్నా వారు తినడం మంచిది కాదు.





Untitled Document
Advertisements