2021లో వాట్సాప్‌ తెచ్చిన ఫీచర్లు

     Written by : smtv Desk | Thu, Dec 23, 2021, 11:37 AM

2021లో వాట్సాప్‌ తెచ్చిన ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp)కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న దాదాపు అందరూ వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు మరిన్ని సదుపాయాలు అందిస్తోంది వాట్సాప్‌. ఇదే క్రమంలో 2021లో చాలా ఫీచర్లను తీసుకొచ్చింది. వ్యూవన్స్, మల్టీ డివైజ్ సపోర్ట్, డిసపియరింగ్ మోడ్ లాంటి ఎన్నో సదుపాయాలను తీసుకొచ్చింది. వాటిలో ముఖ్యమైనవేంటి.. మీరు ఏ ఫీచర్లు వాడుతున్నారో చూడండి..

​వ్యూ వన్స్ (View Once)
పంపిన వీడియో కానీ, ఫొటో కానీ రిసీవర్ ఒకేసారి చూడగలిగేలా పంపే ఫీచరే వ్యూ వన్స్. ఈ ఫీచర్ ద్వారా యూజర్ పంపిన మీడియా.. రిసీవర్ ఒక్కసారి చూశాక డిలీట్ అవుతుంది. ఫోన్‌ గ్యాలరీలో కూడా సేవ్ అవదు.

​డిసప్పియరింగ్ మోడ్ (Disappearing Mode)
చాట్‌లోని మెసేజ్‌లు నిర్దిష్ట కాల వ్యవధిలో ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యేందుకు ఈ డిసప్పియరింగ్ మోడ్ ఫీచర్ ఉపయోగపడుంది. 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు ఇలా నిర్ధిష్ట కాలాన్ని ఎంచుకొని మేసెజ్‌లు డిలీట్ అయ్యేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు.

మల్టీ డివైజ్ సపోర్ట్ (Multi-Device Support)
స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్‌ ప్రైమరీ అకౌంట్‌కు ఇంటర్నెట్ కనెక్ట్ కాకున్నా.. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల్లో వాట్సాప్‌ వెబ్ ద్వారా వాడుకునే సదుపాయం ఈ మల్టీ డివైజ్ సపోర్టు వల్ల వచ్చింది. అంటే ఎక్కువ డివైజుల్లో వాట్సాప్‌ వాడుకోవచ్చు. వాట్సాప్‌ వెబ్ వాడాలంటే నిరంతరం స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం లేదు.

గ్రూప్ కాల్స్‌లో జాయిన్ అయ్యేలా (Joinable group calls)
గ్రూప్ వీడియో కాల్, వాయిస్ కాల్ మధ్యలో యూజర్ జాయిన్ అయ్యే సదుపాయాన్ని ఈ ఫీచర్ ద్వారా తీసుకొచ్చింది వాట్సాప్‌. అంటే హాజరు రావాల్సిన గ్రూప్ కాల్ మిస్సయినా మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావొచ్చు.. అలాగే ఎజ్సిట్ అయి మళ్లీ రావొచ్చు.

వాయిస్ మెసేజ్ ప్రివ్యూ (Voice Message Preview)
వాయిస్ మెసేజ్ పంపే ముందే ఏం రికార్డు అయిందో చెక్ చేసుకునే సదుపాయం ఈ వాయిస్ మెసేజ్ ప్రివ్యూ ఆప్షన్ ద్వారా వచ్చింది. సెండ్ చేసే ముందు వాయిస్ మెసేజ్ లో ఏం ఉందో యూజర్ మరోసారి వినవచ్చు.

ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ క్లౌడ్ బ్యాకప్ (End-to-End Encrypted Backup )
వాట్సాప్‌ నుంచి యూజర్ బ్యాకప్ చేసే డేటాను గూగుల్, యాపిల్ లాంటి థర్డ్ పార్టీలు ఏవీ యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా ఈ ఈ ఏడాది ఎండ్ టూ ఎండ్ క్లౌడ్ బ్యాకప్ సెక్యూరిటీ ఫీచర్ తెచ్చింది వాట్సాప్‌.

వాట్సాప్‌ పేమెంట్స్ అప్‌డేట్‌ (WhatsApp Payments Update)


పేమెంట్స్ సెక్షన్ లోనూ ఈ ఏడాది కొత్త అప్‌డేట్‌లు తెచ్చింది వాట్సాప్‌. క్యాష్ బ్యాక్స్ ఇవ్వడం, స్టిక్కర్ రూపంలో చెల్లింపులు చేయడం లాంటివి తీసుకొచ్చింది.

స్టిక్కర్ ప్యాక్స్ (Sticker Packs)
యాప్‌లో చాలా స్టిక్కర్ ప్యాక్స్ ఈ సంవత్సరం తీసుకొచ్చింది వాట్సాప్‌. యూజర్ల కోసం రకరకాల స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే వాట్సాప్‌ వెబ్ కు స్టిక్కర్ మేకర్ ఫీచర్ తీసుకురాగా.. మొబైల్‌ యాప్‌కు సైతం త్వరలోనే ఈ ఫీచర్ రానుంది.





Untitled Document
Advertisements