ఆర్‌బీఐ కొత్త రూల్స్...క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు తెలుసుకోవాలి

     Written by : smtv Desk | Thu, Dec 23, 2021, 06:41 PM

ఆర్‌బీఐ కొత్త రూల్స్...క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు తెలుసుకోవాలి

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కొత్త రూల్స్ తీసుకువస్తోంది. కొత్త ఏడాది నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడే అవకాశముంది. మరీముఖ్యంగా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజర్లు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈకామర్స్ సంస్థలు, జొమాటో, స్వీగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు జనవరి 1 నుంచి కస్టమర్ల కార్డు వివరాలను స్టోర్ చేసుకోకూడదు. అంటే కొత్త రూల్స్ ప్రకారం.. కస్టమర్ షాపింగ్ చేసినప్పుడు లేదా పుడ్ ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారీ కార్డు వివరాలను ఎంటర్ చేసి ట్రాన్సాక్షన్లను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలా ప్రతిసారీ కార్డు వివరాలు ఎంటర్ చేయకుండా ఉండాలంటే టోకెనైజేషన్ సర్వీసులు పొందొచ్చు. టోకెనైజేషన్ విధానంలో కార్డు వివరాల స్థానంలో ఒక ప్రత్యేకమైన కోడ్ వస్తుంది. దీని ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. కార్డు వివరాల అవసరం ఉండదు.

కొత్త రూల్స్ నేపథ్యంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కలిగిన వారు తెలుసుకోవాల్సిన 10 అంశాలు ఇవే..

1. 2022 జనవరి 1 నుంచి కస్టమర్లు వారి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో సేవ్ చేసుకోవడం కుదరదు.
2. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించే ప్రతిసారీ కార్డు వివరాలను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి వస్తుంది.
3. ప్రతిసారీ వివరాలు ఎంటర్ చేయకుండా ఉండేందుకు కస్టమర్లు వారి కార్డుల టోకెనైజేషన్‌కు ఈకామర్స్ కంపెనీలకు అనుమతి ఇవ్వాలి. అప్పుడు ఈకామర్స్ కంపెనీలు అడిషనల్ ఫ్యాక్టర్ అథంటికేషన్ ద్వారా మీ కార్డు వివరాలను ఎన్‌క్రిప్ట్ చేయాలని కార్డు నెట్‌వర్క్ కంపెనీల కోరతాయి.
4. ఈకామర్స్ కంపెనీలకు ఎన్‌క్రిప్టెడ్ వివరాలు అందిన తర్వాత.. కస్టమర్లు వారి కార్డును భవిష్యత్ లావాదేవీల కోసం సేవ్ చేసుకోవచ్చు.
5. ప్రస్తుతానికి మాస్టర్ కార్డు, వీసా కార్డులకు మాత్రమే టోకెనైజేషన్ ఫెసిలిటీ లభిస్తోంది. ఇతర కార్డులకు కూడా త్వరలోనే ఈ టోకెనైజేషన్ ఫెసిలిటీ అందుబాటులోకి రావొచ్చు.
6. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు.. ఇలా రెండింటికీ రిజర్వు బ్యాంక్ కొత్త రూల్స్ వర్తిస్తాయి.
7. కొత్త నిబంధనలు అంతర్జాతీయ లావాదేవీలకు వర్తించదు. కేవలం డొమెస్టిక్ కార్డులు, ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఆర్‌బీఐ కొత్త రూల్స్ వర్తిస్తాయి.
8. కస్టమర్లు కార్డుల టోకెనైజేషన్‌కు ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సిన పని లేదు.
9. ఈకామర్స్ కంపెనీలు టోకెనైజ్డ్ కార్డుల చివరి నాలుగు అంకెలను కస్టమర్లకు చూపిస్తాయి. బ్యాంక్, కార్డు నెట్‌వర్క్ పేర్లు కూడా కనిపిస్తాయి. దీని ద్వారా కార్డులను గుర్తుపట్టొచ్చు. అలాగే ఈజీగా లావాదేవీలు నిర్వహించొచ్చు.
10. కార్డుల టోకెనైజేషన్ అనేది తప్పనిసరి మాత్రం కాదు. ట్రాన్సాక్షన్లను త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే లేదు. ఇది పూర్తిగా మీ ఇష్టం.





Untitled Document
Advertisements