గుండె సమస్యలకు ఈ ఆహారం చక్కటి పరిష్కారం!

     Written by : smtv Desk | Fri, Dec 24, 2021, 12:51 PM

గుండె సమస్యలకు ఈ ఆహారం చక్కటి పరిష్కారం!

రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. హైపర్‌టెన్సివ్ రోగులలో పెరుగు ద్వారా చేసిన ఈ అధ్యయనం సానుకూల ఫలితాలను వెల్లడించింది. అధిక రక్తపోటు వల్ల గుండె సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధ పడుతున్న వారు.. దాన్ని నియంత్రించుకునేందుకు మార్గాలను కనుగొనడం ముఖ్యం. డైరీ ఫుడ్ లో ముఖ్యంగా పెరుగు.. రక్తపోటుపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు.
పాల ఉత్పత్తుల్లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఈ కారకాలన్నీ రక్తపోటును తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగపడతాయి. పెరుగులోని ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా.. ప్రోటీన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. దీంతో రక్తపోటును తగ్గుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, క్రమం తప్పకుండా పెరుగు తినేవారిలో రక్తపోటును 7 పాయింట్ల వరకు తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

అధిక బీపీ లేదా రక్తపోటుతో సంబంధం ఉన్న చెడ్డ విషయం ఏమిటంటే.. చాలా మందికి ఈ వ్యాధి చాలా ఆలస్యంగా నిర్ధారణ అవుతుంది. ప్రజలు దాని లక్షణాలను అర్థం చేసుకోలేరు లేదా ఆలస్యంగా తెలుసుకుంటారు. చాలా సార్లు పరిస్థితి చాలా తీవ్రంగా మారేవరకూ, రోగి తన పరిస్థితి గురించి తెలుసుకోలేడు. ప్రజలకు దాని గురించి తెలియదు. దాని కారణంగా ఇది సమస్యగా మారుతుంది. ఈ లక్షణాలు ఎక్కువగా లేదా.. వీటిలో ఏ మూడు సమస్యలైనా తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు రక్తపోటు పరీక్ష చేయించుకోవాలి.
✤ విపరీతమైన అలసట
✤ విపరీతమైన తలనొప్పి
✤ విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది
✤ ముక్కు నుంచి రక్తం కారడం
✤ శ్వాసకోశ సమస్యలు
అయితే మీ జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.
✤ ప్రతిరోజూ మీ రక్తపోటు స్థాయిని తనిఖీ చేయండి.
✤ మీరు వైద్యుడికి చూపించినట్లయితే, ఆయన సలహాను జాగ్రత్తగా పాటించండి.
✤ ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తినండి.
✤ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. కానీ, భారీ వ్యాయామాలు చేయకుండా ఉండండి. అదేవిధంగా నిపుణుడి పర్యవేక్షణలో మాత్రమే వ్యాయామాలు చేయండి
✤ ఎండలో, చల్లని గాలిలో ఎక్కువసేపు ఉండకండి. మీరు ఒకవేళ అలా ఉండాల్సి వచ్చినట్టయితే.. మీ స్వంత భద్రతను జాగ్రత్తగా చూసుకోండి.

హైబీపీని కంట్రోల్‌ చేయాలంటే ఉప్పు, కొవ్వు కలిగిన ఆహారం, తక్కువ చక్కెర ఉన్న డైట్‌ మెయింటెన్‌ చేయాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, బీన్స్, కూరగాయలు, గింజలు తీసుకోవాలి. చక్కెర చాలా పరిమితంగా ఉండాలి. ప్రతిరోజు భోజనంలో మిరియాలు, పుట్టగొడుగులు, బచ్చలికూర, ఆలివ్ నూనెతో వండిన ఆమ్లెట్ తినాలి. ఈ ఆహరాలు అధిక బీపీని కంట్రోల్ చేయడానికి సహయపడుతాయి. లంచ్ కోసం, ట్యూనా, బీన్స్, టోఫు, చికెన్, తీసుకోవచ్చు. అదనంగా తాజా ఆకుకూరలు, నిమ్మకాయతో చేసిన సలాడ్స్‌ చేర్చుకోవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం ఆహారంలో ఆలివ్ ఆయిల్, అవకాడోస్, గింజలు, విత్తనాలను చేర్చవచ్చు. ఆలివ్ ఆయిల్‌తో వంటలు తయారు చేయాలి. గింజలను చిరుతిండిగా తినాలి. అల్పాహారం కోసం నువ్వులు, నిమ్మరసంతో అవోకాడో టోస్ట్ చేసుకోవచ్చు. గుడ్లు, చికెన్, చేపలు తప్పనిసరిగా భోజనంలో ఉండాలి. అయితే అధిక మొత్తంలో కాకుండా కొద్దిగా ఉంటే సరిపోతుంది. అప్పుడప్పుడు చేపలు, చికెన్‌ సూప్‌లు కూడా తీసుకోవచ్చు.
ఆకుకూరలలో పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, లెట్యూస్, కొల్లార్డ్ గ్రీన్స్, క్యాబేజీ వంటి ఆకుకూరలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడంతో అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. రక్త నాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. రక్తపోటును తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. వెల్లుల్లిని అధిక రక్తపోటును తగ్గించే మంచి ఔషధం అని చెప్పవచ్చు
టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కెరోటినాయిడ్లను కలిగి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఏదో ఒక రూపంలో మనం నిత్యం తీసుకోవడంతో అధిక రక్తపోటు ను తగ్గించుకోవచ్చు
అరటిపండులో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి చక్కగా పనిచేస్తుంది. మంచి రక్తనాళాల్లోకి రక్తం ప్రవహించేటప్పుడు ఆ వేగానికి రక్తనాళాల గోడల మీద పడి ఒత్తిడిని తగ్గిస్తుంది.
కివీలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్రమం తప్పకుండా మనం కివిని తీసుకోవడంతో అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనం క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్‌ను తీసుకోవడంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడవచ్చు.





Untitled Document
Advertisements