సీతాఫలం గింజలతో తలలో పేలు మాయం!

     Written by : smtv Desk | Sun, Jan 02, 2022, 04:07 PM

సీతాఫలం గింజలతో తలలో పేలు మాయం!

పొడవాటి దట్టమైన జుట్టు ఉన్నవారు జుట్టును సరిగ్గా కాపాడుకోలేకపోతే పేలు పడటం జరుగుతుంది. స్కూల్స్ కి వెళ్లే పిల్లలకు ఈ పేల బాధ మరి ఎక్కువగా ఉంటుంది. పేలు, పేలు పెట్టే పిల్లలు వల్ల తలంతా దురద గా ఉంటుంది. అయితే పేలు పోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
* పౌడర్ లో కొంచెం డి. టీ. టీని కలిపి పడుకునే ముందు తలకు పట్టించి తెల్లవారి తలస్నానం చేయాలి.
* బిట్టర్ ఆల్మండ్స్ ను పేస్ట్గా చేసి తలకు పట్టించి తలకు గుడ్డ చుట్టి కొద్ది సేపు అయిన తర్వాత తలస్నానం చేయాలి.
* సీతాఫలం గింజలను పగులకొట్టి దాంట్లో ఉన్న తెల్లని గింజల పేస్ట్ లా చేసి తలకు పట్టించి తెల్లవారి స్నానం చేయాలి.
* అలాకాకుండా సీతాఫలం గింజల లో ఉన్న తెల్లని గింజలను ఎండబెట్టి పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి తలకు రాస్తూ ఉంటే పేల బాధ తగ్గుతుంది.

అలాగే పేనుకోరుకుడు సమస్య కూడా చాలామందిని వేధిస్తుంది. అసలు ఈ సమస్య రావటానికి కారణాలు ఎక్కువ కాలం మానసిక వత్తిడులు ఉండడం వలన, మెంటల్ షాక్ తినడం వలన, రక్తహీనత, విటమిన్స్ తగ్గడం వలన. అయితే పెనుకోరుకుడుకి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
* మిరియాల పొడి. ఉల్లిపాయ, ఉప్పు ఈ మూడు కలిపి ఆ మిశ్రమాన్ని మచ్చలపై రాయాలి .
* ఐదు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం రెండు స్పూన్ చోలియాపౌడర్ ఈ మూడిటిని కలిపి తలకు పట్టించి ఒక గంట తరువాత షాంపూతో కడిగేయాలి.
* మెంతి ఆకుల్ని పేస్ట్గా చేసి పేనుకోరుకుడు ఉన్నచోట గోరువెచ్చని నీటితో కడిగేయాలి.






Untitled Document
Advertisements