లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి!

     Written by : smtv Desk | Sun, Jan 02, 2022, 04:09 PM

 లిప్స్టిక్ ఎలా వేసుకోవాలి!

అందంగా. ఆకర్షణీయంగా కనిపించాలి అని ఎవరికీ మాత్రం ఉండదు. అందంగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా లిప్స్టిక్ ఇది లేకుండా వారి రోజువారి అలంకరణ పూర్తి కానేకాదు. ప్రతి యువతి దగ్గర దాదాపు నాలుగైదు షేడ్స్ లిప్స్టిక్ కచ్చితంగా ఉండాలిసిందే. మరి అలాంటి లిప్స్టిక్ సరిగ్గా వేసుకోపోతే ఆకర్షణీయంగా కనబడరు సరి కాదా, మిమ్మల్ని చూసిన వారు మీ గురించి చర్చించుకోవడం మాత్రం జరుగుతుంది. అయితే ఎలాంటి లిప్స్టిక్ ఎంచుకోవాలి, ఎలా వాడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* చవక రకం లిప్స్టిక్ వాడొద్దు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి.
* లిప్స్టిక్ రాసుకునే ముందు పాలతో ముంచిన దూదిని పెదాలను బాగా క్లీన్ చేసుకోవాలి. పెదాలు శుభ్రంగా లేకపోతే లిప్స్టిక్ మెరుపు, అందము కనపడదు. కాంతివంతంగా కూడా కనిపించవు. పొరలు పొరలుగా ఉంటుంది.
* ఎక్కువ సేపు లిప్ స్టిక్ నిలిచి ఉండాలంటే రెండు సార్లు వేసుకోవాలి. ఒకసారి వేసుకున్నాక టిష్యూ పేపర్ తో మృదువుగా రుద్దాలి. తరువాత మరోసారి వేసుకోవాలి.
* ఎప్పుడూ లిప్స్టిక్ వేసుకున్న పడుకునే ముందు దాన్ని తొలగించి పడుకోవడం మర్చిపోకండి.
* లిప్స్టిక్ వేసుకునే ముందు వ్యాజిలైన్ రాసి,దాని మీద లిప్స్టిక్ రాసుకుంటే పెదాలు పగలకుండా ఉంటాయి.
* లిప్స్టిక్ వేసుకున్న తర్వాత లిప్ లైనర్ వాడండి. దీనివల్ల లిప్స్టిక్ మూతి చుట్టూ పరుచు కోకుండా ఉంటుంది.
* లిప్స్టిక్ ట్యాగ్లైన్ కలిపి రాసుకుంటే పెదవులు కొత్త మెరుపులను సంతరించుకుంటాయి.
* ఫౌండేషన్ క్రీము రాసుకుని బాగా ఆరనివ్వండి. ముందు లిప్స్టిక్ను అంటీ అంటనట్లు గా రాసుకుంటూ పోతే క్రమంగా మెల్లమెల్లగా అద్దుకుంటూ పోవాలి.
* మంచి లిప్స్టిక్ అంటే దాని లక్షణాలు త్వరగా రంగు పోకూడదు, రంగు పాలిపోయిన కూడదు, ఆహారము తీసుకుంటున్న నీరు తాగిన రంగు పోకూడదు.
*లిప్స్టిక్ పెదాలను కాంతివంతంగా ఉంచటమే కాకుండా ముఖానికి సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. లిప్స్టిక్ వేసుకుంటున్నప్పుడు బ్రష్ లను ఉపయోగించాలి.
* నిలబడి లిప్స్టిక్ వేసుకోవద్దు. ఎందుకంటే అలా చేస్తే పరుచుకొని పోతుంది. అలాంటప్పుడు పౌడర్ రాసుకుని లిప్స్టిక్ వేసుకుంటే.
* లిప్స్టిక్ ట్యూబ్ లు, స్టిక్కర్లు, పెన్సిలు బయట మార్కెట్లో ద్రవరూపంలోని దొరుకుతాయి. లిప్స్టిక్ అంటే క్రొవ్వు పదార్థము. ఆ పదార్థము పెదాలను దృఢంగా అంటుకునేటట్టు చేస్తుంది.
* లిప్స్టిక్ వేసుకోగానే రంగు మారిపోతుంది. అలాంటప్పుడు బాక్స్ మీద కలర్ చూసి, మంచి కంపెనీవి కొన్న మీ పెదాల మీద లిఫ్టిక్ రాసుకో గానే రంగు మారి పోతుంటే దానికి కారణం మీరు పెదవులను పదే పదే కొరికే అలవాటు ఉండటం కారణం కావచ్చు. ఆ అలవాటు లిప్స్టిక్ అసలు రంగును మార్చేస్తుంది. గోధుమ రంగు,ఎరుపు రంగు లిప్స్టిక్ రాసుకునే వాళ్ళకి ఈ సమస్య తక్కువగా ఉంటుంది.





Untitled Document
Advertisements