వైరస్ దెబ్బకు విద్యా సంస్ధల మూసివేత!

     Written by : smtv Desk | Mon, Jan 03, 2022, 01:06 PM

వైరస్ దెబ్బకు  విద్యా సంస్ధల మూసివేత!

వైరస్ దెబ్బకు విద్యా సంస్ధల మూసివేత!

కరోనా దెబ్బకి విద్యాసంస్థలు చాలా కాలం పాటు మూసివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కాస్త వైరస్ తగుముఖం పట్టింది అనుకుని స్కూల్, కాలేజీలు ఆన్లైన్ కాకుండా ఆఫ్ లైన్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కారణంగా చదువుపై సరైన శ్రద్ధ పెట్టలేక, టీచర్స్ చెప్పేది అర్ధం అవక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, తలిదండ్రులు కాస్త సంతోషించే లోపే మళ్ళి వైరస్ పెరగడంతో పాటు కొత్తరకం వైరస్ కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపధ్యంలో తిరిగి విద్యాసంస్థలు మూసివేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. కారణం కరోనా తీవ్రత వ్యాప్తికి విద్యా సంస్ధలు ప్రధాన హబ్ గా మారుతున్నాయన్న ఆందోళనతోనే ముందుజాగ్రత్తగా వివిధ రాష్ట్రాలు విద్యాసంస్ధలను మూసేస్తున్నాయి. మొదటి ఢిల్లీలో మూసేశారు. ఆ తర్వాత తమిళనాడులో పదిరోజుల పాటు విద్యాసంస్ధలను మూసేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇపుడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ఒకటి రెండు రోజుల్లో మహారాష్ట్ర కర్నాటక ప్రభుత్వాలు కూడా విద్యాసంస్ధల మూసివేత నిర్ణయం ప్రకటించబోతున్నాయని సమాచారం. ఎందుకంటే పై రెండు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత బాగా పెరిగిపోతోంది. నిజానికి ఇప్పటికే మహారాష్ట్ర విద్యా సంస్ధలను మూసేయాల్సింది. అయితే ఏ కారణంగా ఇంకా మూయలేదో అర్ధం కావటంలేదు. ఎందుకంటే దేశం మొత్తం మీద అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్ధానంలో ఉంది.
శుక్రవారం నుండి 24 గంటలల్లో మహారాష్ట్రలో దాదాపు 8 వేల కేసులు నమోదవ్వటం సంచలనంగా మారింది. మొత్తం కేసుల్లో సుమారు 5 వేల కేసులు ఒక్క ముంబాయ్ లో మాత్రమే రికార్డయ్యాయి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ముంబయ్ లో చాలారోజులుగా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఒకవైపు కర్ఫ్యూ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయంటేనే పరిస్దితి చేయిదాటిపోతోందని అర్ధమవుతోంది. మంత్రులు ఎంఎల్ఏలు 35 మందికి కరోనా సోకటమే పరిస్ధితికి అద్దం పడుతోంది.
ఇక బెంగుళూరులో పరిస్దితులు దాదాపు ఇలాగే ఉంది. ఇక్కడ కూడా కేసుల తీవ్రత పెరిగిపోతున్నది. రాష్ట్రమంతా ఒకఎత్తు బెంగుళూరు ఒకఎత్తన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఇక్కడ కూడా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దాంతో విద్యాసంస్ధల మూసివేసే విషయంలో చర్చలు జరుగుతున్నాయి. విద్యాసంస్ధల్లో ఎవరికైనా కరోనా సోకితే అది చాలా స్పీడుగా పాకిపోతుందని ప్రభుత్వం ఆందోళన పడుతోంది. అందుకనే తొందరలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇదే దారిలో తెలంగాణా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements