ముఖకాంతిని పెంచే ప్యాక్!

     Written by : smtv Desk | Mon, Jan 03, 2022, 01:09 PM

 ముఖకాంతిని పెంచే ప్యాక్!

కాలాలతో సంబంధం లేకుండా మెరిసే మోము మీసొంతం కావాలి అనుకుంటే ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెరిసే ఆరోగ్యకరమైన చర్మం కావాలి అనుకుంటే ముఖ్యంగా తాజా పళ్ళు, కూరగాయలు, సరిపడా నీరు, తగినంత నిద్ర వీటి పాత్ర ఎంతగానో ఉంటుంది. వీటితో పాటు ఇంట్లో దొరికే వస్తువులతో రకరకాల ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకుంటే మీ ముఖకాంతి పెరుగుతుంది. కొన్ని రకాల ఫేస్ ప్యాక్స్ మీ కోసం..

అరటిపండుతో ప్యాక్
* బాగా పండిన అరటి పండు గుజ్జును చేసి అందులో ఒక చెంచా తేనె రెండు చెంచాల పాల మీగడ కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు డీప్ ఫ్రిజ్లో ఉంచాలి. పది నిముషాల తర్వాత బయటకు తీసి ముఖానికి పూతలా వేసుకోవాలి. కొద్దిసేపటికి గోరువెచ్చని నీటితో తడిపి మునివేళ్లతో మర్దన చేసి శుభ్రపరుచుకుంటే అలసిన చర్మం మృదువుగా అవుతుంది.
ద్రాక్ష పళ్లతో ప్యాక్
* మూడు ద్రాక్ష పళ్ళ ను మెత్తగా మెదిపి ఆ గుజ్జును చెంచా చొప్పున పాలపొడి,గంధం కాసిన పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. రాత్రిపూట ఈ ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.
కలబంధ తో ప్యాక్
* రెండు చెంచాల కలబంద గుజ్జులో నానబెట్టి మెత్తగా చేసిన బాదం పేస్ట్, తేనె, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాలయ్యాక చల్లని నీళ్ళతో ముఖం కడుక్కుంటే వేడి ప్రభావం తగ్గుతుంది.
టమాటా తేనె ప్యాక్
* టమాటో లోని గుజ్జులా చేసి దానికి కొన్ని తేనె చుక్కలు కలిపి ముఖానికి పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకుంటే అలసట తగ్గుతుంది.
టాన్ పోయేందుకు
* నాలుగు టీ స్పూన్ల పాలు, ఒక టీస్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖం పై టైం బాగా ఉన్న చోట రాసి 15 నిమిషాల పాటు ఉంచి ఎండిపోయిన తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేయాలి.

హెర్బల్ క్లీన్సింగ్ క్రీమ్
కావలిసినవి : కొబ్బరి నూనె : రెండు చెంచాలు, ఆలివ్ ఆయిల్:ఐదు చెంచాల, గ్లిజరిన్ :రెండు చెంచాలు,తేనె మైనం : నాలుగు చెంచాలు,దోసకాయ రసం: ఐదు చెంచాలు,బోరాక్స్ పౌడర్ : చిటికెడు.
తయారుచేయు విధానం
మైనం,కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్,రెండుసార్లు వేడి చేసుకోవాలి. దోసకాయ రసం, గ్లిజరిన్, బోరాక్స్ విడి విడి పాత్రలలో వేడి చేయాలి. బోరాక్స్ ను మాత్రం పూర్తిగా కరిగేవరకు వేడిచేయాలి. ఈ మూడిటిని ఆయిల్ మిశ్రమంలో బాగా గట్టిపడేవరకు కలపాలి. చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టి ఉపయోగించుకోవాలి.

లినోలిక్ లాడ్జింగ్ క్రీమ్
కావాల్సినవి
రెండు చెంచాలు పెట్రోలియం జెల్లీ, ఒక చెంచా లెనోలిన్, ఆలివ్ ఆయిల్ : ఐదు చెంచాల కొబ్బరి నూనె : రెండు చెంచాల.
తయారు చేయు పద్ధతి
ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, లెనోలిన్ కలిపి రెండు సార్లు వేడి చేయాలి. తరువాత దాంట్లో పెట్రోలియం జెల్లీ కలపాలి. వేడి తగ్గేవరకు చెంచా తో కలుపుతూ చల్లారబెట్టాలి. తరువాత దీనిని ఫ్రిజ్లో పెట్టుకుని వాడుకోవచ్చు.





Untitled Document
Advertisements