భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

     Written by : smtv Desk | Mon, Jan 03, 2022, 02:16 PM

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!

బంగారం కొనాలి అనుకుంటున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్ వరుసగా ఈ ఏడాది రెండో రోజు కూడా పసిడి రేటు పైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. భారీగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర మెరిసింది. అయితే వెండి రేటు మాత్రం నేలచూపులు చూసింది.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు పైకి చేరాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 49,600కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 360 పెరుగుదలతో రూ. 45,460కు ఎగసింది.
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ. 1200 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 66,600కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.10 శాతం పరుగులు పెట్టింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1830.45 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం వెలవెలబోయింది. వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 23.29 డాలర్లకు క్షీణించింది.






Untitled Document
Advertisements