బ్రేకప్ పై క్లారీటీ ఇచ్చిన దీప్తి.. లైవ్ లో కన్నీళ్లు!

     Written by : smtv Desk | Mon, Jan 03, 2022, 02:17 PM

బ్రేకప్ పై క్లారీటీ ఇచ్చిన దీప్తి.. లైవ్ లో కన్నీళ్లు!

దీప్తీ సునైన , షణ్ముఖ జశ్వంత్ పరిచయం అక్కర్లేని పేర్లు. ఇద్దరు కూడా youtube స్టార్స్ ఇంకా బిగ్ బాస్ మాజీ కంటెస్టేట్స్ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దీప్తి సునైన మరియు షన్నూ ల బ్రేకప్ గురించిన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యూత్ లో ఈ బ్రేకప్ బర్నింగ్ టాపిక్ గా మారింది. దీప్తి సునైన పుకార్లకు చెక్ పెడుతూ షన్నూ కు బ్రేకప్ చెప్పేసిన విషయం తెల్సిందే.
షన్నూ కూడా తన నిర్ణయంను గౌరవిస్తాను.. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె జీవితం సాఫీగా సాగాలని కాస్త ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇద్దరి పోస్ట్ లు వైరల్ అయ్యాయి. అయితే షన్నూ పోస్ట్ కాస్త ఎమోషనల్ గా ఉండటంతో చాలా మంది షన్నూకు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు.
ఈ సమయంలో దీప్తి సునైన లైవ్ కు వచ్చి అభిమానులతో చిట్ చాట్ చేసింది. లైవ్ లో ఎక్కువ శాతం మంది అభిమానులు బ్రేకప్ గురించి ప్రశ్నలు అడగడం.. నిర్ణయం మార్చుకోవడం.. కారణాలు అడగడం వంటివి చేశారు. దాంతో దీప్తి ఎమోషనల్ అయ్యింది. బ్రేకప్ నుండి బయట పడటం కోసం లైవ్ కు వచ్చి కొద్ది సమయం అభిమానులతో ముచ్చటించాలి అనుకున్న దీప్తికి పాపం అక్కడ కూడా అవే ప్రశ్నలు ఎదురవ్వడం తో తట్టుకోలేక పోయింది.
ఆమె ఎమోషన్ ను ఎంతగా కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా వీలు పడలేదు. దాంతో ఆమె కన్నీళ్లు కూడా పెట్టేసుకుంది. తన కన్నీటిని దాచేందుకు ఆమె ప్రయత్నించింది. కొద్ది సమయం తన కుక్క పిల్లను చూపిస్తూ నవ్వుతున్నట్లుగా నటించింది.. అయినా కూడా ఆమె ఫేస్ లో ఎమోషన్ ను దాచలేక పోయింది.
కన్నీరు ఆపుకోలేక కొద్ది సమయం కెమెరా నుండి దూరంగా వెళ్లి పోయింది. దీప్తి సునైన కన్నీరు చూసి ప్రతి ఒక్కరి హృదయం కదిలింది. ఆమె ఎమోషనల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అనుకున్నారు. దీప్తి సునైన బ్రేకప్ ను ఎంత భారంగా ఫీల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె బ్రేకప్ ను కొందరు విమర్శించారు.
ఆమె ఊరికే చిన్న విషయానికి బ్రేకప్ చెప్పి ఉండదు. ఖచ్చితంగా ఆమె కు బలమైన రీజన్ ఉండి ఉంటుంది. ఆమె కన్నీళ్లు చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రేమించిన వ్యక్తి దూరం అయినప్పుడు బాధ ఉంటుంది. దూరం అయిన తర్వాత కూడా కన్నీళ్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా షన్నూ అంటే ఇంకా దీపూ కు ప్రేమ ఉందేమో అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మద్య ఉన్న అపోహలు తొలగి పోయి మళ్లీ కలిసి పోతే బాగుండు అంటూ ఇద్దరి అభిమానులు కూడా కోరుకుంటున్నారు





Untitled Document
Advertisements