పడిపోయిన బంగారం,వెండి ధరలు!

     Written by : smtv Desk | Tue, Jan 04, 2022, 08:56 AM

పడిపోయిన బంగారం,వెండి ధరలు!

గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పడిపోయింది. పసిడి రేటు బాటలోనే వెండి ధర కూడా పయనించింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇదే ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 240 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 49,360కు పడిపోయింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 210 తగ్గుదలతో రూ. 45,250కు క్షీణించింది.
బంగారం ధర దిగివస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 400 పడిపోయింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 66,200కు తగ్గింది.






Untitled Document
Advertisements