ఏడాదికి సరిపడా ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. ఏ నెట్‌వర్క్‌లో ఎలా ఉన్నాయి చూసేయండి!

     Written by : smtv Desk | Tue, Jan 04, 2022, 08:57 AM

ఏడాదికి సరిపడా ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..  ఏ నెట్‌వర్క్‌లో ఎలా ఉన్నాయి చూసేయండి!

కొత్త సంవత్సరం తొలి వారంలోనే ఏడాదికి సరిపడా ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో , ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఐడియా నుంచి సుదీర్ఘ కాలం వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్‌లు ఎలా ఉన్నాయో చూడండి. డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వచ్చే ఎక్కువ కాలం వ్యాలిడిటీ ప్లాన్‌లు ఈ నెట్‌వర్క్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. వార్షిక ప్లాన్‌ల వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. కొన్ని ప్లాన్‌లకు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో సుదీర్ఘ వ్యాలిడిటీ ప్లాన్‌లు ఎలా ఉన్నాయో చూడండి.

రిలయన్స్ జియో
రూ.2,879 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది రిలయన్స్ జియో. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే సంవత్సరం పాటు రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కాగా రూ.3119 ప్లాన్‌తోనూ 365 వ్యాలిడిటీ ఉండనుండగా.. ఓ ఓటీటీ ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే ఏడాది పాటు డిస్నీప్లస్ ‌హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 10జీబీ అదనపు డేటా లభిస్తుంది.
రిలయన్స్ రూ.4199 ప్లాన్‌ ద్వారా రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ.2,545 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 336 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే జియోకు చెందిన జియో టీవీ, జియో సినిమా లాంటి యాప్స్ ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఎయిర్ టెల్
సంవత్సరం వ్యాలిడిటీతో మూడు ప్లాన్‌లను అందిస్తోంది ఎయిర్‌టెల్. రూ.2,999 ప్లాన్ ద్వారా రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. అలాగే ఇదే ప్రయోజనాలు, వ్యాలిడిటీతో రూ.3,359 ప్లాన్ కూడా ఉంది. అయితే ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అదనంగా ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
ఇక ఎయిర్‌టెల్ రూ.1,799 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 24జీబీ డేటా, 3600ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 365 రోజులు. ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే వింక్ మ్యూజిక్, ఫ్రీ హలో ట్యూన్ లాంటి ప్రయోజనాలు అదనంగా వస్తాయి.

వొడాఫోన్ ఐడియా Vi లోనూ మూడు వార్షిక ప్లాన్‌లు ఉన్నాయి. రూ.2,899 ప్లాన్ ద్వారా రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఇక రూ.3,099 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్నా అదే వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే ఏడాది పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా వస్తుంది.
ఇక రూ.1,799 వొడాఫోన్ ఐడియా ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటా, 3600ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. Vi ప్లాన్‌లతో రీచార్జ్ చేసుకుంటే అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్య అపరిమిత డేటా వినియోగించుకునే సదుపాయం బింగే ఆల్ నైట్, వీకెండ్ రోల్ ఓవర్ డేటాతో పాటు ప్రతీనెలా 2జీబీ అదనపు డేటా ప్రయోజనాలు లభిస్తాయి.
ఇక మీ ఫోన్ నెట్వర్క్ ని బట్టి నచ్చిన ప్లాన్స్ ఎంచుకొండి మరి.





Untitled Document
Advertisements