మహిళలు పెళ్లి తర్వాత ఇంట్లో నుండే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు!

     Written by : smtv Desk | Sat, Jan 08, 2022, 12:10 PM

మహిళలు పెళ్లి తర్వాత ఇంట్లో నుండే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు!

సాధారణంగా పెళ్లి అయిన తరువాత అమ్మాయి ఇంటిపేరు మారిపోతుంది. అత్తింటి వారి ఇంటిపేరునే అమ్మాయి ఇంటిపేరుగా మార్చేస్తారు. మారిన పేరుని చెప్పుకోవడం సులభమే కాని పలురకాల గుర్తింపు కార్డులలో పేరుని మార్చుకోవాలి ముఖ్యంగా ఆధార్ కార్డు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వారి యొక్క గుర్తింపుకు ప్రతీక ఆధార్ కార్డ్ అయితే ఈ ఆధార్ కార్డ్ లో పెళ్లి అయిన అమ్మాయి ఇంటి పేరు మార్చుకోవాలి అంటే గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే మీరు మీ ఇంటిపేరుని మార్చుకోవచ్చు అదెలాగో తెలుసుకుందాం..
* ముందుగా మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. తర్వాత మై ఆధార్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* ఇప్పుడు అప్‌డేట్ యువర్ ఆధార్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత అప్‌డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లాగిన్‌పై క్లిక్ చేయాలి.
* ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. ఈ ఓటీపీ ఆధార్ కార్డ్ లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కి వస్తుంది.
* లాగిన్ అవుతారు. ఇప్పుడు మీకు పలు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో మీరు అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ప్రోసీడ్ అప్‌డేట్ అనే దానిపై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు మీకు లాంగ్వేజ్, పేరు, పుట్టిన తేదీ, జెండర్, అడ్రస్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో పేరు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు అప్‌డేట్ చేసుకోవడానికి అర్హత ఉంటే టిక్ మార్క్ పడుతుంది. లేదంటే మీరు పేరును అప్‌డేట్‌ చేసుకోలేరు.
* టిక్ మార్క్ పెట్టిన తర్వాత ప్రొసీడ్ అప్‌డేట్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పేరు ఎలా మార్చుకోవాలో ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. రూ.50 ఫీజు కట్టాలి. అంతే మీ ఆధార్ అప్‌డేట్ అవుతుంది.

ఇకపోతే పేరు మొత్తం పూర్తిగా మార్చుకోవడానికి వీలుండదని గమనించాలి. అలాగే పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వాటిని కొన్ని సార్లు మాత్రమే అప్‌డేట్ చేసుకోవడం వీలవుతుంది. అందువల్ల మీరు గతంలోనే పేరును ఒకసారి అప్‌డేట్ చేసుకొని ఉంటే.. మళ్లీ మళ్లీ పేరు మార్చుకోవడం కుదరదు.





Untitled Document
Advertisements