కరోనా బారినపడ్డ కట్టప్ప.. ఆసుపత్రిలో చేరిక!

     Written by : smtv Desk | Sat, Jan 08, 2022, 12:13 PM

కరోనా బారినపడ్డ కట్టప్ప.. ఆసుపత్రిలో చేరిక!

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీ వారితో మొదలు అయ్యిందనిపిస్తుంది. ఇప్పటికే సినిమా పరిశ్రమకు చెందిన పదుల సంఖ్యల ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు నుండి మొదలుకుని బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా కరోనా తో బాధ పడుతున్న వారు ఉన్నారు. ఇప్పుడు బాహుబలి స్టార్ కట్టప్ప కూడా కరోనా బారిన పడ్డాడు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో పాటు ఆయన వయసు కాస్త ఎక్కువ అవ్వడం వల్ల వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్లుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నాడని.. ఎక్కువ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. ఇప్పటికే సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. మహేష్ బాబు నుండి మొదలుకుని బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా కరోనాతో బాధ పడుతున్నవారు ఉన్నారు. ప్రస్తుతం బాహుబలి లో కట్టప్పగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయిన ప్రముఖనటుడు సత్యరాజ్ కూడా కరోనా బారిన పడ్డారు. కట్టప్పకు వయసు కాస్త ఎక్కువ పైగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఆయనను ఆసుపత్రికి తరలించినట్టుగా తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయన కాస్త సీరియస్ గానే ఉన్నాడని.. ఎక్కువ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతానికి సత్యరాజ్ ఆరోగ్యం నిలకగడా ఉందని చెబుతున్నారు. సత్యరాజ్ ఒక షూటింగ్ లో పాల్గొన్న సమయంలో కోవిడ్ బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ సినిమా యూనిట్ సభ్యులు అంతా కూడా క్వారెంటైన్ లో ఉన్నారని తెలుస్తోంది. సత్యరాజ్ వెంటనే కోలుకోవాలని.. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో తప్పకుండా వైధ్యుల నుండి మంచి వార్త వింటామని తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.

Untitled Document
Advertisements