ఏ విటమిన్ లోపం వలన ఎలాంటి జబ్బులు వస్తాయంటే?

     Written by : smtv Desk | Sat, Jan 08, 2022, 01:09 PM

ఏ విటమిన్ లోపం వలన ఎలాంటి జబ్బులు వస్తాయంటే?

విటమిన్లు వివిధ జీవ రసాయన చర్యలను నియంత్రించే రెగ్యులేటర్లు గా ఉంటాయి. విటమిన్ అనే పదాన్ని పరిచయం చేసినది ఫంక్. మొక్కలు, సూక్ష్మజీవులు విటమిన్లు సంశ్లేషిస్తాయి. విటమిన్లు ఎంజైములలోని అంతర్భాగాలుగా పనిచేస్తాయి.  ఇవి స్వల్ప పరిమాణంలో జీవనచర్యలు జరిగేలా చేస్తాయి. మనుషులు కొన్ని విటమిన్లు మాత్రమే సంశ్లేషణ చేసుకోగలరు. సాధారణంగా రోజుకు మనకు 10•8 నుంచి 10•11 విటమిన్లు అవసరం. విటమిన్లు నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. బి, సి విటమిన్లు నీటిలో కరిగేవి కాగా, ఏ, డీ, ఇ, కె విటమిన్లు కొవ్వులో కరుగుతాయి. విటమిన్ ఏ క్యారెట్, బొప్పాయి, బచ్చలి, తోటకూర వంటి వాటిల్లో లభిస్తాయి చేప కాలేయ నూనెల్లో కూడా విటమిన్ ఏ లభ్యమవుతుంది. విటమిన్ ఏ వలన నేత్ర వ్యాధులు రావు. కంటిచూపు అభివృద్ధికి, అలాగే చర్మ సౌందర్యానికి విటమిన్ ఏ అవసరం. ఇక విటమిన్ బి అనేది ఒక కాంప్లెక్స్. దీనిలో సుమారు పన్నెండు రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. థయామిన్ రైబోఫ్లేవిన్, నియాసిన్, పెరిడాక్స్న్, పాంటోథినిక్ ఆమ్లం, ఫోలిక్ ఆమ్లం, బయోటిన్, కొబాలమైన్ వంటివి బి రకానికి చెందిన విటమిన్లు. ఇది దంపుడు బియ్యంలోనూ,  పెంకుగల ఫలాలులోనూ ఈస్ట్ శిలీంద్రాలలోనూ అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ లోపం వల్ల బెరిబెరి, పెల్లాగ్రా అనేమియా వంటి వ్యాధులు కలుగుతాయి. విటమిన్ సి ఉసిరికాయలు అధికంగా ఉంటుంది. దీని లోపం వల్ల స్కర్వి అనే వ్యాధి కలుగుతుంది. విటమిన్ డి ఇది మనకు సూర్యరశ్మి నుంచి సహజసిద్ధంగా దొరుకుతుంది. చర్మ కణాల్లోని 7 డిహైడ్రోకొలెస్ట్రాల్ నుంచి అతి నీలలోహిత కిరణాల వల్ల ఏర్పడుతుంది. మనకు డి విటమిన్ చేప కాలేయ నూనెలోనూ, పాలు, వెన్న, గుడ్డులో ను పుష్కలంగా లభ్యమవుతుంది. దీని లోపం వలన రికెట్స్ అనే వ్యాధి కలుగుతుంది. విటమిన్ ఇ లోపం వల్ల వంధ్యత్వం ఏర్పడుతుంది. ఈ విటమిన్ మనకు మొలకెత్తుతున్న గోధుమ గింజలు అధికంగా ఉంటుంది.  విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహకరిస్తుంది. ఇది కాయగూరలు, చేపలు, లివర్ లో లభిస్తుంది.
మన శరీరం రోగాల బారిన పడకుండా విటమిన్లు కాపాడుతాయి అందుకనే ఈ విటమిన్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కో విటమిన్ గురించి విడివిడిగా తెలుసుకుందాం
* విటమిన్ ఏ:- ఇది చర్మం, కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెలుగు సరిగా లేనప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు కూడా కళ్ళు బాగా పనిచేసేలా చేస్తుంది. విమానాలు నడిపే వారు రాత్రి వేళల్లో చీకట్లో సరిగా చూడగలగాలి కదా అందుకని వారికి అదనంగా ఏ విటమిన్లు ఇస్తారు.
క్యారెట్, టమాటా, ఆకుకూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది.

* విటమిన్ బి :- దంపుడు బియ్యం లో ఉండేది విటమిన్ బి 1. సరైన ఎదుగుదలకు ఈ విటమిన్ సహకరిస్తుంది. గోధుమల్లో,వరిబియ్యంలో ఉండే గోధుమరంగు పొట్టులో విటమిన్ బి1ఉంటుంది.
పాలల్లో, వెన్నలో, కూరగాయలు, ఆకుకూరల్లో,
కాలేయంలో కూడా ఈ విటమిన్ ఉంటుంది.

* విటమిన్ సి :- నిమ్మరసంలో ఉండే ది సి విటమిన్. స్కర్వి అనే వ్యాధిని మాత్రమే కాకుండా శరీరం గాయమైనప్పుడు దానికదే కోలుకునేలా ఈ విటమిన్ చేస్తుంది. ఎముకలకు పళ్లకు క్యాల్షియం అవసరం. అయితే ఆహారంలో ఉండే క్యాల్షియం ని మన శరీరం ఉపయోగించుకునేలా సి-విటమిన్ చేస్తుంది.
నారింజ, నిమ్మ, టమాట, ద్రాక్ష పళ్లలో సి-విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

* విటమిన్ డి :- కాడ్ లివర్ ఆయిల్ లో ఈ విటమిన్ ఎక్కువ. ఎముకలు, పళ్లు తిన్నగబలంగా పెరిగేలా చేస్తుంది. అడ్డదిడ్డంగా ఎముకలు పెరిగేలా చేసే రికెట్స్ అనే వ్యాధి రాకుండా చేస్తుంది.
చేపల్లో కాలేయంలో గుడ్లలోని పసుపుపచ్చ భాగంలో  ఈ విటమిన్ దొరుకుతుంది. సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకినా ఈ విటమిన్ మనకు అందుతుంది.





Untitled Document
Advertisements