ఆ కంపెనీని అమ్మేసిన మహీంద్రా!

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 12:02 PM

ఆ కంపెనీని అమ్మేసిన మహీంద్రా!

గత కొంతకాలంగా అంతర్జాతీయంగా చెలరేగిపోతున్నాయి కొన్ని దేశీయ కంపెనీలు.రిలయన్స్ అధినేత కావొచ్చు, పలు ఇతర కంపెనీలు కావొచ్చు. అంతర్జాతీయంగా పలు కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఏ మ్మాత్రం వెనుకంజ వేయడంలేదు. అయితే తాజాగా ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న మహీంద్రా గ్రూప్స సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అదే వారు అంతర్జాతీయంగా కొన్న విదేశీకంపెని అమ్మకం.
దక్షిణ కొరియాకుచెందిన శాంగ్ యాంగ్ మోటార్స్ ను పూర్తిగా అమ్మేసినట్లుగా చెబుతున్నారు. ఈ కంపెనీలో మహీంద్రా ఆనంద్ కు 75 శాతం వాటా ఉంది. ఇంతకీ ఈ కంపెనీని అమ్మేయటానికి కారణం.. కంపెనీ నష్టాల నుంచి బయటకు రాలేకపోవటమే. శాంగ్ యాంగ్ కంపెనీని మహీంద్ర అండ్ మహీంద్రా కొనుగోలు చేయాలని 2010లో నిర్ణయించారు. అయితే.. ఈ కంపెనీ భారీగా నష్టాల్ని కొనసాగించటంతో ఈ కంపెనీని వదులుకోవటానికి సిద్ధమయ్యారు.
ఓవైపు భారీ నష్టాలు,అప్పుల కారణంగా ఈ కంపెనీని అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. కాకుంటే.. దీన్ని కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోవటం గమనార్హం. ఇలాంటి వేళ.. మహీంద్రా కొత్త కొనుగోలుదారుని కనుగొనడంలో విఫలమైనందున శాంగ్యాంగ్ మోటార్ చాలా నెలలుగా దక్షిణ కొరియా కోర్టు రిసీవర్షిప్లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎడిసన్ మోటార్స్ తమ కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా శాంగ్ యాంగ్ వెల్లడించింది.
సుమారు 254.56 మిలియన్ డాలర్లకు దీన్ని కొనుగోలు చేశారు. వరుస పెట్టి కొనుగోళ్లు చేయటమే కాదు..నష్టాల్లో కూరుకుపోతున్న వేళ.. అప్రమత్తంగా అమ్మకాన్ని పూర్తి చేయటం విశేషంగా చెప్పక తప్పదు. ఈ కంపెనీని కొవిడ్ దెబ్బతీసిందనే చెప్పాలి. ఈ కంపెనీకి చెందిన వాహనాల అమ్మకాలు తగ్గిపోతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే కంపెనీని వదిలించుకోవాలన్న నిర్ణయానికి రావటం..అమ్మకాన్ని పూర్తి చేయటం విశేషంగా చెప్పక తప్పదు





Untitled Document
Advertisements