ఒక్కడినే సింగిల్గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదు..పవన్ కళ్యాణ్!

     Written by : smtv Desk | Wed, Jan 12, 2022, 12:03 PM

ఒక్కడినే సింగిల్గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదు..పవన్ కళ్యాణ్!

వైసిపీ నేత జగన్ అధికారంలోకి వచ్చిన న్నాటి నుండి ఆంధ్రాలో రాజకీయాల్లో పొత్తుల మీద పద పదే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్న జగన్ పార్టీకి వ్యతిరేకంగా బలమైన పార్టీలు జతకట్టాల్సిందేనని... అలా జరిగితేనే జగన్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చు అనే వాదన వినిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగా అప్పటికి ఎన్నో పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కానీ..
ఇందులో భాగంగా పొత్తులపై పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నోటి నుంచి పొత్తు మాట రావటమేకాదు.. జనసేన మీద వన్ సైడ్ ప్రేమే తప్పించి.. వారి నుంచి ఎలాంటి ప్రపోజల్ రావటం లేదని.. అలాంటప్పుడు పెళ్లి సాధ్యం కాదన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పిన బాబుపై సెటైర్లు వేసినోళ్లు వేస్తే.. మరికొందరు పవన్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. తాజాగా పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యనిర్వాహక సభ్యులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన ఆయన పొత్తులపై స్పందించారు. అందరితో కలిసి చర్చించిన తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని కీలక వ్యాఖ్య చేశారు. తాము ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని.. రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చని పవన్ అభిప్రాయపడటం గమనార్హం.
‘‘రకరకాల పార్టీలు మనతోనే పొత్తు కోరుకోవచ్చు. అయితే ప్రస్తుతం పొత్తుల కంటే ముందుగా పార్టీ బలోపేతం సంస్థాగత నిర్మాణంపైనే కార్యకర్తలు ఫోకస్ పెట్టాలి. పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలి. నేను ఒక్కడినే సింగిల్గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదు. పొత్తులనేవి ప్రజాస్వామ్యంగా ఆమోద యోగ్యంగా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. పొత్తులపై నిర్ణయం తీసుకునేలోగా ఎవ్వరూ వేరే విధంగా మాట్లాడొద్దని సూచించారు.
వేర్వేరు పార్టీలు ఆడే మైండ్-గేములో పావులు కావొద్దన్న పవన్ కల్యాణ్.. పార్టీ క్రియాశీలక సభ్యత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కారణంగా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించ లేక పోయామని.. కానీ క్షేత్రస్థాయిలో జనసేన బలం పుంజు కుంటోందన్నారు. ఏపీలో ఏ మూలకు వెళ్లినా జనసేన జెండా రెపరెప లాడుతోందన్నారు
పార్టీ స్థాపించే సమయంలో పార్టీ వెంట ఉన్న యువకులే నేడు నేతలుగా ఎదిగారన్న పవన్.. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే యువతరం మనతోనే ఉందన్నారు. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభను ఘనంగా జరుపుకోవాలన్నారు. ఆవిర్భావ సభ నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేస్తామని పవన్ చెప్పారు.
పవన్ తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. పొత్తులపై ఏ విషయాన్ని తేల్చకుండా.. ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యానించారని చెప్పాలి. రాజకీయంగా విశేష అనుభవాన్ని ప్రదర్శించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.





Untitled Document
Advertisements