ఈ టిప్స్ తో మీ వెయిట్ కంట్రోల్ అవుతుందట!

     Written by : smtv Desk | Thu, Jan 13, 2022, 12:19 PM

ఈ టిప్స్ తో మీ వెయిట్ కంట్రోల్ అవుతుందట!

ఈ టిప్స్ తో మీ వెయిట్ కంట్రోల్ అవుతుందట!



మనం అధికబరువుతో భాదపడుతూ ఆ బరువుని తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు చేస్తుంటాం. అలాగే డైటింగ్ చేయడం. యోగా చేయడం. జిమ్ కి వెళ్ళడం. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం. ఇలా బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే ఏ మాత్రం కష్టపడకుండా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు ఇలా చేస్తే..ఇప్పుడు మేం చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించండి. మీ వెయిట్ కచ్చితంగా అదుపులో ఉంటుంది. ఇంతకూ ఆ టిప్స్ ఏంటంటే..

* ఫుడ్ తీసుకునేటప్పుడు ఆదరాబాదరగా తినొద్దు. మెల్లగా నమిలి తినండి. ఇలా చేయడం వల్ల ఫుడ్ తక్కువగా తీసుకుంటాం. త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
* ఫుడ్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండుతుంది. ఆకలి తగ్గడం వల్ల శరీరంలోకి తక్కువ కెలరీలు చేరతాయి. ఘెర్లిన్, జీఎల్‌పీ-1 లాంటి హార్మోన్లపై ప్రొటీన్లు ప్రభావం చూపుతాయి. ఇవి ఆకలి పెంచడంలో, కడుపు నిండిన భావన కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చికెన్ బ్రెస్ట్, చేపలు, గ్రీక్ యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, ఆల్మండ్స్ లాంటి ఫుడ్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.
* పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి కాదు. విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం వెయిట్ తగ్గేందుకు ఉపకరిస్తుంది. విస్కోస్ ఫైబర్ మొక్కల నుంచి లభించే ఫుడ్లోనే ఉంటుంది. బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో ఈ పీచు పదార్థం ఉంటుంది.
*మంచి నీటిని తరచుగా తాగడం వల్ల ఫుడ్ తక్కువగా తీసుకుంటాం. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది. భోజనానికి ముందు మంచినీళ్లు తాగని వారితో పోలిస్తే.. తాగేవారు త్వరగా వెయిట్ తగ్గుతారు. 12 వారాలపాటు చేసిన అధ్యయనంలో తినడానికి ముందు నీరు తాగిన వారు 44 శాతం అధికంగా వెయిట్ కోల్పోయినట్టు తేలింది.
* మితంగా ఫుడ్ తినే వారితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో లాగించే వారు త్వరగా వెయిట్ పెరుగుతారు. కొంచెం కొంచెం వడ్డించుకొని తినడం వల్ల శరీరంలోకి తక్కువ కేలరీలు చేరతాయి.
* తినేటప్పుడు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం లాంటి పనులు చేస్తే.. ఎంత తింటున్నామనే ఆలోచన ఉండదు. ఫలితంగా ఎక్కువ తినేస్తాం. పరధ్యానంగా తినడం వల్ల 25 శాతం ఎక్కువ కేలరీలు తీసుకుంటారు.
* తీపిగా ఉండే బేవరేజెస్ జోలికి వెళ్లొద్దు. సోడా లాంటి డ్రింక్స్ తాగడం వల్ల రోగాల ముప్పు పెరుగుతుంది. షుగర్ డ్రింక్స్ వల్ల శరీరంలోకి ఎక్కువ కేలరీ చేరతాయి. ఘన పదార్థాల ద్వారా ఒంట్లో చేరిన కేలరీలకు ఇవి అదనం. అందుకే బేవరేజెస్ మానేయడం వల్ల దీర్ఘాకాలికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.





Untitled Document
Advertisements