డయాబెటిస్ నియంత్రించడంలో దాల్చినచెక్క!

     Written by : smtv Desk | Thu, Jan 13, 2022, 02:55 PM

డయాబెటిస్ నియంత్రించడంలో దాల్చినచెక్క!

డయాబెటిస్ ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరిని వేధిస్తున్న సమస్య. డయాబెటిస్ రావడానికి గల కారణాలు మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, అధికబరువు మరియు జీవనశైలిలో మార్పులు. కారణం ఏదైనప్పటికీ డయాబెటిస్ అనేది మనల్ని మానసికంగా కృంగదీసే సమస్య. నచ్చింది తినడానికి ఉండదు. అయితే మన జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే గనుక మనం సంతోషంగా ఉండవచ్చు. రోజు ఒక 30 నిమిషాలపాటు నడక, కొద్దిసేపు తేలికపాటి మార్పులు, వీలైతే ధ్యానం వంటివి చేస్తూ ఆహారపు అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మరి ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తీసుకోదగ్గ ఆహారం మరియు వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
✤ జామపండు: జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్‌ పెరగడాన్ని నివారిస్తుంది. జామపండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌లు ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వెంటనే పెరిగే షుగర్‌ స్థాయిని నివారించడానికి వారి ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలను చేర్చుకోవాలి.
✤ దాల్చినచెక్క: ఈ మసాలా ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉంది. రక్తంలో గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిని నియంత్రించడంలో దాల్చినచెక్క సహాయపడుతుంది. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం కోసం దాల్చినచెక్కను ఉపయోగించడండ మేలు. దీంతోపాటు దాల్చిన చెక్క నీటిని తాగడం మంచిది.
✤ నారింజ: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు ‘డయాబెటిస్ సూపర్ ఫుడ్స్’. మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మీ ఆహారంలో చేర్చుకోవాలి. నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మీరు దీన్ని సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
✤ క్యారెట్లు: పోషకాలు అధికంగా ఉండే క్యారెట్లు మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. క్యారెట్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, డయాబెటిక్ రోగులు దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
✤ లవంగాలు: లవంగాలలో నైజెరిసిన్ మూలకం ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.





Untitled Document
Advertisements