దంపతులు విడిపోవడానికి కారణాలు ఇవేనట!

     Written by : smtv Desk | Wed, Jan 19, 2022, 01:08 PM

దంపతులు విడిపోవడానికి కారణాలు ఇవేనట!

నేటి జంటలు దాదాపు సమస్య చిన్నదైనా, పెద్దదైనా విడిపోవడం, విడాకులు తీసుకోవడమే పరిష్కారం అంటున్నారు. కారణం ఏదైనా చాలా మంది ఇలా చిన్న చిన్న గొడవలను పెద్దది చేసుకుంటూ సమస్యలని బాగా పెద్దగా ఊహించుకుని విడాకుల దాకా వెళ్ళి పోతున్నారు కానీ నిజానికి ఆ క్షణం సర్దుకుపోతే తరువాత బాగానే ఉంటుంది అనే వాస్తవాన్ని వారు గ్రహించలేకపోతున్నారు.
అయితే దంపతులు విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇవి కనుక మీ వైవాహిక జీవితం లో లేకుండా మీరు చూసుకున్నట్టయితే మీ బంధం చక్కగా ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు భార్య భర్తలు పక్క పక్కనే కూర్చుంటారు. చూడడానికి ఇద్దరు కలిసి ఉన్నారు కదా అని అనుకుంటారు. కానీ నిజానికి లాప్‌టాప్, ఫోన్‌తో బిజీగా ఒకరి పక్కన ఒకరు కూర్చుని స్క్రీన్స్‌లో నిమగ్నమై పోతూ ఉంటారు. ఈ కారణంగా వాళ్ల మధ్య మాటలు ఉండవు. దీని వలనే బంధం కూడా దూరం అయిపోతుంది. పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉండడం వల్ల ప్రేమ మాయమైపోతుంది.
ఈ కారణంగా చాలా మంది భార్యా భర్తల మధ్య ఇబ్బందులు వస్తాయి. అయితే ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఒకరి సమయాన్ని ఒకరికి ఇవ్వాలి. మీరు సమయాన్ని ఇస్తేనే మీ మధ్య మాటలు ఉంటాయి. అలానే మీ బంధం కూడా మధురంగా ఉంటుంది లేదంటే ఇబ్బందులు తప్పవు.
చాలా మంది భార్యా భర్తలు ఎమోషనల్‌గా దూరంగా ఉంటారు. అది నిజానికి వాళ్ళ మధ్య స్పేస్‌ని క్రియేట్ చేస్తుంది. అలానే సరైన కమ్యూనికేషన్ కూడా వాళ్ళ మధ్య ఉండదు. ఈ కారణంగా కూడ వారి మధ్య ఇబ్బందులు వస్తాయి. పైగా దానికి తోడు ప్రతి ఒక్కరి ఉద్యోగంలో ఒత్తిడి కలుగుతుంది. ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీని వల్ల కూడా భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఇటువంటివి రాకుండా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి. అంతే కానీ నాకెందుకులే అని ఉండకూడదు అప్పుడు ప్రేమ కూడా మాయమైపోతుంది కాబట్టి భార్య భర్తలు ఈ విషయం లో కూడా జాగ్రత్తగా ఉండాలి.
మొదట శృగారంలో ఆసక్తి వున్నా.. కొన్ని రోజుల తర్వాత భార్యా భర్తలిద్దరికీ కూడా దీని మీద ఆసక్తి ఉండదు. లేదంటే కొంత మందికి సమయమే ఉండదు. చాలా మంది కొత్త వాటిని ప్రయత్నం చేయకుండా మధ్యలోనే శృంగారాన్ని వదిలేస్తూ ఉంటారు. దీంతో మంచి అందమైన జీవితం మాయమైపోతుంది. వీటి వల్ల కూడా ఎక్కువ భార్య భర్తలు ఇబ్బందులు పడతారు. అందుకని భార్యాభర్తలు దీని పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే సమస్యలు తప్పవని గ్రహించాలి.
ఒక్కొక్క సారి భార్య కానీ భర్త కానీ బాధ్యతగా లేకపోతే మరొకరికి ఇబ్బంది కలుగుతుంది. అలానే వాళ్ళని అస్సలు పట్టించుకోవడం కూడా మానేస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు..?, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది..?, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..? ఇలాంటివి ఏమీ కూడా వాళ్లు పట్టించుకోరు. ఇలా ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉండాలి. ఒకరు ఎలా ఉన్నారు అనేది అడగాలి. లేదంటే కూడా వాళ్ళ మధ్య ఇబ్బందులు వస్తాయి అని తెలుసుకోండి. ఈ ఇబ్బందులు మీ వైవాహిక జీవితంలో కలగకుండా చూసుకోండి.
వ్యసనం వలన కూడ చాలా మంది భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. కెఫిన్, ఆల్కహాల్ వంటి వాటికి బానిసలై పోతుంటారు. దీనితో ని కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. బాధ్యతగా కూడా ఉండరు. ఇలా వీటి వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే భార్య భర్తల మధ్య గొడవలు రాకుండా ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా వీటన్నిటికి దూరంగా ఉండాలి.





Untitled Document
Advertisements