ఈ జంట విడాకులకు కారణం సుచీ లీక్స్!

     Written by : smtv Desk | Thu, Jan 20, 2022, 11:54 AM

ఈ జంట విడాకులకు కారణం సుచీ లీక్స్!

ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఆమె వయసు అతనికన్నా ఎక్కువే అయినా ఆమెనే కావాలనుకున్నాడు అతడు. నిజంగానే సినిమాటిక్ లవ్ స్టోరీకి ఏమాత్రం తీసిపోని క్యుట్ లవ్ స్టోరీ వారిది. తన కంటే రెండేళ్లు పెద్దదైన సెలబ్రిటీని పెళ్లాడటం ద్వారా నటుడు ధనుష్ వార్తల్లో వ్యక్తిగా మారారు. అంతేకాదు.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనంతో ఒక్కసారిగా ధనుష్ వార్తల్లో వ్యక్తిగా మారారు. పెళ్లి తర్వాత వారిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితాన్నినడిపిస్తున్నట్లుగా కనిపించేవారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలు చాలామందిని ఆసూయకు గురయ్యేలా చేసేవి.
అలాంటి ఈ జంట తాజాగా విడాకులు తీసుకోవటం షాకింగ్ గా మారింది. ఊహించని రీతిలో విడాకుల ప్రకటనను చేసిన వారు కామ్ గా ఉండిపోయారు. కానీ.. వీరి విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. విడాకుల వరకు వెళ్లేంత పెద్ద ఇష్యూ ఏం జరిగింది? పద్దెనిమిదేళ్ల కాపురాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు? అన్న క్వశ్చన్ కు సమాధానం లభించని పరిస్థితి.
వీరి దాంపత్య జీవితంలో చిచ్చు పెట్టింది సుచీలీక్స్ గా పలువురు చెబుతున్నారు. అప్పట్లో పెను సంచలనంగా మారిన సుచీ లీక్స్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే.. ఇప్పటి విడాకులకు కారణమైందని చెబుతున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం 2017లో కోలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన ఉదంతంగా సుచీలీక్స్ ను చెప్పాలి.
ప్రముఖ సింగర్ సుచిత్ర.. సుచీ లీక్స్ పేరుతో తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని విడుదల చేసి దుమ్ము దుమారం చేశారు. ఈ సందర్భంగా గాయని సుచిత్ర మైండ్ సెట్ బాగోలేదని.. ఆమె డిప్రెషన్ లో ఉండి ఏవేవో పిచ్చి పోస్టులు పెడుతున్నట్లుగా కూడా చెప్పేశారు.
ఇది ధనుష్ - ఐశ్వర్య దాంపత్య జీవితంలో కల్లోలానికి కారణమైందని చెబుతారు. అప్పటి నుంచి మొదలైన పొరపొచ్చాలుఅంతకంతకూ ఎక్కువ అయినట్లు చెబుతారు. తాజాగా వాటిని భరించలేకపోతున్నారని.. అందుకే విడాకులు తీసుకున్నారన్న మాట కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

Untitled Document
Advertisements