పాలు విరిగాయా.. అయితే ఇలా చేయండి!

     Written by : smtv Desk | Thu, Jan 20, 2022, 12:01 PM

పాలు విరిగాయా.. అయితే ఇలా చేయండి!

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు పాలు విరిగిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు విరిగిన పాలను పడేస్తుంటారు. కానీ ఆ పాలను పడేసే బదులు చక్కగా ఈ రేసిపిలు ట్రై చేయండి..
పెరుగు:- విరిగిన పాలతో పన్నీర్ తరువాత లిస్ట్ లో ఉండేది పెరుగే. ఇలా పెరుగు చేయడం చాలా పాపులర్ కూడా. పాలలో ఉన్న బ్యాక్టీరియా వల్ల పాలు విరిగాయి, అదే బ్యాక్టీరియా పాలలో ఉన్న షుగర్స్‌ని ల్యాక్టిక్ యాసిడ్‌గా మార్చేస్తుంది. ఇలా రాత్రంతా ఉంచారంటే తెల్లవారేప్పటికి తాజా పెరుగు సిద్ధమయిపోతుంది.
మిల్క్ కేక్:- మిల్క్ కేక్ గురించి చెప్పేదేం లేదు, అందరికీ తెలిసినదే. పాలు, కోవా తో కలిసి చేసే ఈ మిల్క్ కేక్ అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేట్లు ఉంటుంది. దీని తయారీ విధానం ఏమిటంటే:
1. ఒక మిక్సింగ్ బౌల్‌లో రెండు కప్పుల మైదా, ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ సోడా, నాలుగు టీస్పూన్ల పంచదార పొడి కలపండి. వీటన్నింటినీ బాగా కలిపి అందులో అరకప్పు పాలు, అర కప్పు నీరు కలిపి బాగా కలపండి. వేరే బౌల్‌లో మూడు టేబుల్ స్పూన్ల బటర్‌తో ఒక ఎగ్ ని కలిపి బాగా బీట్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్, బటర్ మిశ్రమాన్ని మొదైటి బౌల్‌లో వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక బటర్ రాసిన బేకింగ్ ట్రే లోకి మార్చి 300 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 నిమిషాలు బేక్ చేయండి. ఆ తరువాత ముక్కలుగా కట్ చేసి ఎంజాయ్ చేయడమే ఆలస్యం.
పకోడీ:- మీరు సరిగ్గానే చదివారు. విరిగిన పాలతో పకోడీలు కూడా చేయవచ్చు. మీరు చేయవలసిందల్లా గోధుమ, రవ్వ, మసాలాలు, కూరగాయలతో పాటు ఈ పాలు కూడా కలిపి పకోడీ పిండి లాగా తయారు చేసి పకోడీలు వేసుకోవడమే. వెంటనే అయిపోయే రెసిపీ ఇది. పెద్ద కష్టం కూడా ఉండదు.
కలాకండ్:- విరిగిన పాలతో కలాకండ్ చేయాలంటే ముందు ఆ పాలఓ ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి స్టవ్ మీద సిమ్‌లో కొన్ని నిమిషాలు ఉంచాలి. అప్పుడే ఈ విరిగిన పాలలో నుండి సరైన షేప్‌లో పన్నీర్ వస్తుంది. ఇప్పుడు నీటినంతా తీసేసి పన్నీర్‌లా చేయండి. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నేలో నాలుగు కప్పుల పాలు పోసి అవి రెండు కప్పులయ్యేంత వరకూ మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పన్నీర్‌ని కలపండి. మిశ్రమం దగ్గర పడే వరకూ మంట మీదే ఉంచండి. కలుపుతూ ఉండడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులో పంచదార వేయండి. చిన్న చిన్న పూసల్లా కనపడగానే స్టవ్ మీద నించి దించేసి బటర్ లేదా నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చండి. అరంగుళం మందం లో పరవండి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి ఎంజాయ్ చేయండి.





Untitled Document
Advertisements